రెండ్రోజులు తిరిగినా కేసీఆర్ నో: ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధ్ ప్రకటించారు. ఫ్యాక్స్‌ ద్వారా ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను పంపించానని చెప్పారు.

కేసీఆర్! అంతా మీ వల్లే: పేదల బాధ చూడలేక పదవికి రాజాసింగ్ రాజీనామా!

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నానని, ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలు వివరిద్దామంటే అపాయింట్‌మెంట్‌ దొరకడంలేదన్నారు.

raja singh lodh

ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ చేశానన్నారు. కాగా, గోషామహల్‌ నియోజకవర్గం పరిధిలోని సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని రాజాసింగ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సోమవారం రాత్రి సీఎం కేసీఆర్‌కు రాసిన మూడు పేజీల లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. మంగళవారం కేసీఆర్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader and Goshamahal MLA Raja Singh Lodh on Wednesday said that he resigned.
Please Wait while comments are loading...