ప్రతిపక్షంలో ఉంటే డబ్బులు రావు కానీ, కేసీఆర్ వద్దకు వెళ్లను: జైపాల్

హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉంటే డబ్బులు రాకపోవచ్చును కానీ, ఖ్యాతి మాత్రం వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు.

అవినీతి కోసమే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని అంటున్నారని ఆయన ఆరోపించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో పార్టీలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడటం ద్వారా మెప్పు పొందవచ్చునని అన్నారు.

హరిత హారంపై కేసీఆర్

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు సరియైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రెండు వారాలపాటు జరిగే హరితహారం కార్యక్రమంలో కలెక్టర్లు క్రియాశీలకంగా పని చేయాలన్నారు.

కేసీఆర్ దొంగ దీక్ష సమాచారం అక్కడుంది: జైపాల్ రెడ్డి సంచలనం

సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రజా ప్రతినిధులు, అన్ని స్థాయిల అధికారులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు మొక్కలు నాటడంతోపాటు వాటిని పరిరక్షించడానికి అవసరమైన వ్యూహం రూపొందించుకోవాలన్నారు.

I will not join with KCR, says Jaipal Reddy

అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరధిలో మొక్కలు నాటే కార్యక్రమం రూపొందించారని, కార్యాచరణ అమలును కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు. రహదారులు, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్ యార్డుల్లో మొక్కలను నాటాలని పేర్కొన్నారు. ఖాళీ ప్రదేశాల్లో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలన్నారు.

ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలి: హరీష్ రావు

మంత్రి హరీష్ రావు ఆదివారం మెదక్ జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కేసీఆర్ దొంగ దీక్ష వివరాలు: రాళ్లతో కొట్టారుగా.. జైపాల్‌పై సుమన్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్‌లో గ్రామస్థులతో కలిసి ఒక్క రోజులోనే లక్షా 5 వేల మొక్కలను నాటామని చెప్పారు. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలన్నారు. వర్షాలు పడాలంటే వనాలను పెంచాలని, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+