దసరా వేడుకల్లో పాల్గొంటా: కేసీఆర్, ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే: మంత్రి జగదీష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని 5 నెలల్లో పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎర్రవెల్లిలో దసరా వేడుకల్లో పాల్గొంటానని సీఎం కేసీఆర్ తెలిపారు. అక్టోబర్ 22న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 5 నెలల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన ఆయన 6 నెలల్లో గజ్వేల్ నియోజకవర్గానికి సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.
మేనిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది: మంత్రి జగదీష్‌రెడ్డి

మేనిఫెస్టోలోని హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల బాధలు తెలిసిన వ్యక్తి అని తెలిపారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగానే పేదలకు సౌకర్యవంతంగా ఉండేలా డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ సూర్యాపేటలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి దసరా రోజున శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications