హైద్రాబాద్ అబివృద్దిపై చర్చకు నేను సిద్దం: తలసాని
హైదరాబాద్: హైద్రాబాద్ అభివృద్దిపై కాంగ్రెస్ పార్టీతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రేటర్ ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు కూడ దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆ పార్టీ నాయకత్వమే పట్టించుకోవడం లేదన్నారు.

హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 'గ్రేటర్' ఎన్నికల్లో రెండు సీట్లు కూడా సాధించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఈ సందర్భంగా తలసాని అన్నారు. తెలంగాణ సచివాలయం తరలింపు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications