పాముకు రెండు నాలుకలుంటే బిజెపికి మాత్రం పది నాలుకలు.!కమలం పార్టీపై హరీశ్ రావు ఫైర్.!
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకున్న సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసిందని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు ఇచ్చిందంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఒకడేమో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క గుంట తడవలేదు అంటాని, మరొకడు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంకు ఏటీఎంలా మారిందంటాడని, అసలు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తారని హరీష్ వివరించారు. ఇవాళ ఇంకో ఎంపి కాళేశ్వరం ప్రాజెక్టు కు 86 వేల కోట్లు తామే ఇచ్చామని లోక్ సభలో అనడం హాస్యాస్పదంగా ఉందన్నరు మంత్రి హరీష్ రావు.
పాముకు రెండు నాలుకలు అయితే, అబద్దాల బిజెపికి మాత్రం పది నాలుకలు ఉన్నాయని, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందాలనే నీచమైన ఆలోచన ఆ పార్టీ నాయకులదని హరీష్ రావు ధ్వజమెత్తారు. సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచనతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తే ఓర్చుకోలేక బీజేపీ ఎంపీలు ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గతంలో సోషల్ మీడియాలోనే అబద్దాలు ప్రచారం చేసే ఈ బీజేపీ నేతలు ఇప్పుడు పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ ను అవమాన పరుస్తూ మాట్లాడ్డం సిగ్గు చేటని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వని కేంద్రం, ఇవాళ నిస్సిగ్గుగా తామే కట్టామని అనడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications