జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం: హరీశ్ సవాల్
హైదరాబాద్/మెదక్: మెదక్ పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా ఆయన వ్యక్తం చేశారు.
తమ పార్టీ మద్దతు పలుకుతున్న జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి విసిరిన సవాల్ స్వీకరించిన హరీశ్ రావు ఈ మేరకు స్పందించారు.

ఆయన గురువారం మాట్లాడుతూ.. జగ్గారెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధమా అని హరీశ్ రావు ప్రతి సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి అభ్యర్థిని గెలిపించడానికి ఇప్పటికే ఓటర్లు నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థiల నుంచి నామమాత్రపు పోటీ మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపిన వామపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications