వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తం ధార పోసేందుకు మీరు సిద్దమైతే, గడీల పాలనపై పోరాడేందుకు నేను రెడీ.!కార్యవర్గ భేటీలో బండి సంజయ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అవినీతి, నియంత కుటుంబ పాలనను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని, అందుకు అనేక ఉదాహరణలున్నాయ, తెలంగాణలో ఉద్యమాల ఫలితంగా రాజకీయంగా పెనుమార్పులు సంభవించాయని, కానీ ప్రజలు ఆశించిన పాలన మాత్రం తెలంగాణలో రాలేదని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేసారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రెండో రోజు సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తెలంగాణలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపి పార్టీ మాత్రమేనని, చంద్రవేఖర్ రావు నియంత పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ ప్రసంగించారు.

 స్వేచ్చా తెలంగాణ కోసం రక్తం ధారపోసేందుకు సిద్దమా.? కార్యకర్తలను ప్రశ్నించిన సంజయ్

స్వేచ్చా తెలంగాణ కోసం రక్తం ధారపోసేందుకు సిద్దమా.? కార్యకర్తలను ప్రశ్నించిన సంజయ్

చంద్రశేఖర్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లాడో ఎవరకి అంతుచిక్కని అంశమని, అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను మరొక్క సారి రెచ్చగొట్టాలని చంద్రశేఖర్ రావు ప్రయత్నించారని, కానీ అపాయిట్ మెంట్ అడగనేలేదని పీఎంవో చెప్పినట్లు మీడియాలో కథనాలు రావడంతో చంద్రశేఖర్ రావు కుట్ర ప్రజలకు అర్ధమైందని బండి సంజయ్ వివరించారు. సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రశేఖర్ రావు అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాలు చేయాలని పన్నాగం పన్నారని, కానీ చంద్రశేఖర్ రావు రావు వ్యూహం మొత్తం బెడిసి కొట్టిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

 బీజేపిని దోషిగా చిత్రీకరించేందుకే ఢిల్లీ పర్యటన.. కేంద్ర పెద్దలు తిప్పికొట్టారన్న సంజయ్..

బీజేపిని దోషిగా చిత్రీకరించేందుకే ఢిల్లీ పర్యటన.. కేంద్ర పెద్దలు తిప్పికొట్టారన్న సంజయ్..

తెలంగాణలో చంద్రశేఖర్ రావుకు రాజకీయ పతనం ప్రారంభమైందని ఓ జ్యోతిష్కుడు స్పష్టం చేసాడని, ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదని, ఆ జ్యోతీష్కుడు ముఖ్యమంత్రికి చెప్పినట్టు బండి సంజయ్ వివరించారు. లేని పోని అబండాలు మోపి బీజేపీని నవ్వులపాలు చేయాలని, బీజేపీని ఎండగడితే తెలంగాణలో మరొక్కసారి అధికారంలోకి రావచ్చనే చంద్రవేఖర్ రావు నీచమైన దుర్బుద్దిని ప్రజలు గ్రహించారని బండి సంజయ్ మండిపడ్డారు. ఢిల్లీ స్థాయిలో బీజేపి ని చులకన చేసేందకు, యావత్ రైతాంగం మద్యలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించేందుకు చంద్రశేఖర్ రావు కుట్ర చేసాడని, కేంద్ర పెద్దల రాజకీయ చతురత ముందు చంద్రశేఖర్ రావు పాచిక పారలేదని బండి సంజయ్ వివరిచారు.

 నియంత పాలనపై తిరగబడాలి.. త్యాగాలకు సిద్దంగా ఉండాలని శ్రేణులకు బండ సంజయ్ పిలుపు

నియంత పాలనపై తిరగబడాలి.. త్యాగాలకు సిద్దంగా ఉండాలని శ్రేణులకు బండ సంజయ్ పిలుపు

చంద్రవేఖర్ రావుకు చెప్పినట్టే తనకూ ఓ జ్యోతిష్కుడు కలిసి కొన్ని అంవాలు వివరించాడని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నయని, పేదలకు సంపూర్ణ న్యాయం జరగబోతోందని, తెలంగాణ తల్లికి విముక్తి లభించబోతోందని ఆ జ్యోతీష్కుడు వివరించాడని సంజయ్ తెలిపారు. బీజేపీతోనే తెలంగాణకు స్వేఛ్చ సిద్దిస్తుందని, తెలంగాణ బడుగు బలహీనుల కల సాకారం కాబోతుందని అందుకోసం కోసం త్యాగాలు చేసేందుకు,రక్తాన్ని ధారపోసేందుకు సిద్దంగా ఉన్నారా అని కార్యకర్తలను బండి సంజయ్ ప్రశ్నించారు. కార్యకర్తలు సిద్ధమైతే గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత తనదని బండి సంజయ్ ఉద్ఘాటించారు.

 తెలంగాణలో బీజేపి జెండా ఎగరడం ఖాయం.. కేసీఆర్ ను తరిమికొట్టాలన్న బండి సంజయ్

తెలంగాణలో బీజేపి జెండా ఎగరడం ఖాయం.. కేసీఆర్ ను తరిమికొట్టాలన్న బండి సంజయ్

ఈ మధ్య కాలంలో రైతుల వడ్లు కొనాలని కొనుగోలు కేంద్రాలకు వెళితే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు ఎలాంటి దాడులకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసని సంజయ్ అన్నారు. రైతులను కాపాడే యత్నంలో 56 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయని, 20 వాహనాలు ధ్వంసమయ్యాయని, అయినా వెన్నుచూపకుండా ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నరని, వారందరికీ నా హ్యాట్సాఫ్ అన్నారు జంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను, మంత్రులను ఉసిగొల్పి పోలీసుల సాయంత బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని బండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలకు దాడులు కొత్త కాదని, తాటాకు చప్పళ్లకు భయపడమని చంద్రశేఖర్ రావును బండి సజయ్ హెచ్చరించారు.

English summary
Bandi Sanjay asked the activists whether they were ready to make sacrifices and shed blood for a free Telangana. Bandi Sanjay stressed that it was his responsibility to mobilize against the kcr dictator regime if the activists were prepared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X