వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం తాగితే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట విన‌దు..! యంత్రం క‌నిపెట్టిన కోరుట్ల కుర్రాడు..!!

|
Google Oneindia TeluguNews

కోరుట్ల/ హైద‌రాబాద్ : మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్..! మీరు మ‌ద్యం సేవిస్తే మీ భార్యే కాదు మీ కారు కూడా మీ మాట విన‌దు. ఔను.. మీరు చ‌దువుతుంది నిజ‌మే..! మీరు మోతాదుకు మించి మ‌ద్యం తాగితే మీ కారు కూడా మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కు గెంటేస్తుంది. మ‌ద్యం సేవించి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఇక మీ కారు మొరాయించి ఎంతకూ స్టార్ట్ అవ్వ‌దు. ఇదే అత్యంత అదునాతన సాంకేతిక‌త‌. మ‌ద్యం సేవించి కారు న‌డుపుతూ ప్రాణాల‌మీద‌కు తెచ్చ‌కుంటున్న యువ‌త‌కు మ‌న కోరుట్ల కుర్రాడు విరుగుడు క‌నిపెట్టాడు. తాగితే అస‌లు కారే క‌ద‌ల‌క‌పోతే ఎలాంటి అన‌ర్థాలు ఉండ‌వుక‌దా అని ఆలోచించిన ఆ కుర్ర‌డు ఇలాంటి ప‌రిక‌రాన్ని క‌నిపెట్టాడు.

వినూత్న ప్రయోగంతో జగిత్యాల జిల్లా కోరుట్ల యువకుడు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మద్యం తాగి కారు నడిపేందుకు ప్రయత్నిస్తే ఇంజిన్‌ అక్కడికక్కడే ఆగిపోయే యంత్రాన్ని కోరుట్లకు చెందిన 22 ఏళ్ల సిరిపురం సాయితేజ రూపొందించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయితేజ తాను తయారు చేసిన యంత్రం గురించి వివరించారు. ఇది వీక్షించిన పలువురు ప్రముఖులు తనను ప్రశంసించారని సాయితేజ తెలిపారు.

If you drink alcohol, your wife does not listen to you too! The guy who has the desire to be invented .. !!

ప్రధాని కార్యాలయం నుంచి తనకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని చెప్పారన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ తదితరులు ప్రశంసించారని వెల్లడించారు. ''తెలంగాణకు చెందిన కుర్రవాడు మరిన్ని ఆవిష్కరణలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. సాయితేజకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించా'' అని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొనడం విశేషం..!

English summary
Telangana boy was found to be the antidote to the young man who was consuming alcohol and driving the car. If you drink, you know that there is no movement in your car, such thing that the boy has invented such a device.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X