రూ..2.5 కోట్ల ప్యాకేజితో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి రికార్డ్..
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT-H) ప్లేస్‌మెంట్లలో ఈ ఏడాది సరికొత్త రికార్డు నమోదైంది. కందిలోని ఐఐటీ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి.. కళ్లు చెదిరే భారీ ప్యాకేజీని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐఐటీ హైదరాబాద్ 2008లో స్థాపించబడిన నాటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్యాకేజీ కావడం విశేషం.
ఐఐటీ హైదరాబాద్‌లో చారిత్రక రికార్డు..
ఐఐటీ హైదరాబాద్ (IIT-H) చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విద్యార్థి ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనం ఆఫర్‌ను అందుకున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్.. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ 'ఆప్టివర్' (Optiver) నుంచి ఈ బంపర్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నారు.

ఇంటర్న్‌షిప్ ద్వారా ఆఫర్..
ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్‌కు ఈ భారీ ఆఫర్ రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ద్వారా లభించింది. తన ఇంటర్న్‌షిప్ సమయంలో చూపిన అసాధారణ ప్రతిభ కారణంగా.. ఆయనకు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO) ప్రకటించింది. ఆ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థులలో కేవలం వర్గీస్ మాత్రమే ఈ ఆఫర్ అందుకోవడం గమనార్హం. ఈ ఏడాది జూలై నుంచి ఆప్టివర్ నెదర్లాండ్స్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధుల్లో చేరనున్నారు.
కాగా హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన 21 ఏళ్ల ఎడ్వర్డ్.. తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లే కావడం వల్ల చిన్నప్పటి నుంచే సాంకేతిక అంశాలపై ఆసక్తి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా మొదటి సంవత్సరం నుంచే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో చురుగ్గా పాల్గొనడం, జాతీయ స్థాయిలో టాప్ 100 ర్యాంకర్లలో ఒకరిగా నిలవడం తన ఇంటర్వ్యూలో నెగ్గడానికి ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ ప్లేస్‌మెంట్ గణాంకాలు వృద్ధిని కనబరిచాయి. సంస్థ యొక్క సగటు ప్యాకేజీ గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 75 శాతం పెరిగింది. గత ఏడాది సగటు ప్యాకేజీ రూ. 20.8 లక్షలుగా ఉండగా, ఈ ఏడాది అది రూ. 36.2 లక్షలకు చేరింది. ఎడ్వర్డ్‌తో పాటు మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు.
కేవలం భారీ ప్యాకేజీలకే పరిమితం కాకుండా, ప్రతి విద్యార్థికి సరైన ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఐఐటీహెచ్ ప్రతినిధులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు మెకానికల్, సివిల్ వంటి కోర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా అగ్రశ్రేణి కంపెనీలలో అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించారు. త్వరలో ప్రారంభం కానున్న రెండో దశ (Phase-2) ప్లేస్‌మెంట్లలో మరిన్ని దేశీయ కంపెనీలు, స్టార్టప్‌లు పాల్గొంటాయని ఐఐటీహెచ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications