హాస్టల్ కోసమని అద్దెకిస్తే..ఓయో రూమ్‌గా మార్చేసి....
హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లా, అన్నోజిగూడ ప్రాంతంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే అరుణ, ఏపీ జెన్‌కోలో పనిచేసే ఆమె భర్త మోహన్ రావు సంస్కృతి టౌన్‌షిప్‌కు సమీపంలో ఒక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ తరహా నిర్మాణం చేపట్టారు. ఈ భవనాన్ని హాస్టల్ ఏర్పాటు కోసం వెంకటేశ్ అనే వ్యక్తికి మూడేళ్ల కాలపరిమితితో అద్దెకు ఇచ్చారు. అయితే, హాస్టల్ ఏర్పాటు చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్న వెంకటేశ్, ఆ భవనాన్ని ఓయో (OYO) నిర్వాహకులకు భారీ ధరకు రెంటుకు ఇవ్వడంతో అసలు కథ మొదలైంది.
ఆ ప్రాంతంలో పెద్దగా లాడ్జీలు లేకపోవడం, చుట్టుపక్కల కాలేజీలు అధికంగా ఉండటం ఓయో నిర్వాహకులకు వరంగా మారింది. ముఖ్యంగా కాలేజీ యువతీ యువకులకు, పెళ్లి కాని జంటలకు ఏకాంతంగా, ఎవరికీ తెలియకుండా స్వేచ్ఛగా గడిపే విడిది కేంద్రం అవసరం ఉంది. దీన్ని పసిగట్టిన ఓయో, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ 'కాకతీయ' పేరుతో హోటల్ ఏర్పాటు చేసి, ఓయో రూమ్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ వ్యాపారం అనతికాలంలోనే ఊపందుకుంది. కాలేజీ విద్యార్థులతో పాటు, ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది యువతులు కూడా ఇక్కడికి తరలివస్తున్నారని, వారంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం, ఓయో కార్యకలాపాలు మొదలైన తర్వాత నరకంలా మారిందని స్థానికులు వాపోతున్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో అర్థరాత్రి పూట భారీగా మద్యపానం.మత్తు పదార్థాల వినియోగం జరుగుతుండటంతో కంటి మీద కునుకు కరువైంది.రూములలోంచి వచ్చే అరుపులు, కేకలు కారణంగా ఆ ప్రాంతం మొత్తం ఒక రకమైన అవాంఛనీయ వాతావరణం నెలకొంది.కాలనీవాసులు ఈ అసాంఘిక కార్యకలాపాలతో విసిగిపోయి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ మండల విద్యాధికారి శ్రీధర్ రెడ్డి రంగంలోకి దిగి, క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి అధికారులకు నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా అధికారులు భవనాన్ని సీజ్ చేయడానికి ప్రయత్నించగా, నిర్వాహకులు రెండు రోజుల గడువు కోరినట్లు సమాచారం.అయితే, ఈ వ్యవహారంలో భవన యజమాని అరుణ వ్యవహరించిన తీరు మరింత విస్మయం కలిగించింది. ఆమె కాలనీవాసులను ఉద్దేశించి, ఎవరికి ఫిర్యాదు చేసినా సరే, అక్కడ కార్యకలాపాలు సాగుతాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా భయబ్రాంతులకు గురిచేసే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు మరియు ప్రశాంతత కోరుకునే కాలనీవాసుల పోరాటం ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తుందో లేదో వేచి చూడాలి.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications