తెలంగాణకు చల్లటివార్త వినిపించిన వాతావరణశాఖ

తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కుబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో వడగాలు కూడా వీస్తాయన్నారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రభావంవల్ల వడగాలు ఎక్కువగా ఉండనున్నాయి.

దీంతో ఈ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు, ఈదురుగాలు వీయనున్నాయి. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. వేడిగాలులతో ప్రజలు బయటకు కూడా రావడంలేదు.

imd good news two days light rains in andhra pradesh

దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గి 40 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. సోమవారం హైదరాబాద్ లో 40 కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే సాయంత్రం సమయంలో చల్లని గాలు వీచాయి. దీంతో నగరవాసులంతా ఉపశమనం పొందారు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయని వెల్లడించారు.

మరోవైపు ఏపీలో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పులు వీస్తున్నాయి. ఏప్రిల్ మొదటివారం నుంచే ఇలా ఉందని, మే వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+