వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కు కేసీఆర్ జలక్ - మునుగోడు కొత్త సమీకరణం : సీఎం కారులోనే సభకు చాడా..!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్ దిగుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే మునుగోడు బహిరంగ సభ వైపే తెలంగాణ రాజకీయాలు ఫోకస్ అయ్యాయి. బీజేపీ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ ముందుగానే రంగంలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

కేసీఆర్ కు కమ్యూనిస్టుల మద్దతు

కేసీఆర్ కు కమ్యూనిస్టుల మద్దతు

అందులో భాగంగా మునుగొండలో కమ్యూనిస్టుల ప్రభావం ఉండటంతో..వారి మద్దతు తీసుకోవటంలో వేగంగా స్పందించారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. నేరుగా కమ్యూనిస్టు నేతలతో మాట్లాడిన కేసీఆర్..వారు టీఆర్ఎస్ కు మద్దతిచ్చేలా ఒప్పించారు. మునుగోడు సభకు రావాలని ఆహ్వానించారు.

దీంతో..చాడా వెంకటరెడ్డి ఈ రోజు కేసీఆర్ పాల్గొనే మునుగోడు సభకు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ తో పాటుగా ముఖ్యమంత్రి కారులోనే చాడా కూడా మునుగోడుకు వెళ్లనున్నారు. మరో వైపు సీపీఎం కూడా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. బీజేపీని ఓడించేందుకు తాము టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లుగా కమ్యూనిస్టు పార్టీల నేతలు వెల్లడించారు.

సీఎంతో సభలో చాడా వెంకటరెడ్డి

సీఎంతో సభలో చాడా వెంకటరెడ్డి

ప్రగతి భవన్ నుంచి భారీ ర్యాలీగా ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు వెళ్లనున్నారు. రెండు వేల కార్లు ర్యాలీలో ఉండేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేసారు. మధ్నాహ్నం నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ సభ ద్వారా టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్ధిని సీఎం ప్రకటిస్తారా లేదా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

అయితే దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వం పట్ల టీఆర్ఎస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో అన్ని మండలాల్లోనూ అసమ్మతి నేతలు ఇప్పటికే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. తరువాత మాత్రమే అభ్యర్ధి ఖరారు పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

మూడు ప్రధాన పార్టీల ఫోకస్

మూడు ప్రధాన పార్టీల ఫోకస్


బీజేపీ రేపు (ఆదివారం) అమిత్ షా సభకు ఏర్పాట్లు చేస్తోంది. భారీగా జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రోజు నుంచే టీపీసీసీ చీఫ్ రేవంత్ మునుగోడు కేంద్రంగా మకాం వేస్తున్నారు. పాదయాత్ర చేయనున్నారు. నియోజకవర్గంలో వినూత్న తరహాలో కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎలాగైనా బీజేపీకి గెలుపు అవకాశాలు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి పట్డుదల తో ఉన్నారు. అదే సమయంలో బీజేపీ సైతం గెలిచి తీరాలని లక్ష్యంతో పని చేస్తోంది. దీంతో..ఈ రోజు రేపు జరిగే బహిరంగ సభల పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
KCR moving strategical steps in Munugodu by poll, Communist parties decided to support TRS in by Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X