నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడు
హైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్‌తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలపై ఆశలు లేకుండా పోయాయి. అక్కడికక్కడే భర్త చనిపోగా .. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ భార్య ఊపిరి వదలింది. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది.
భార్యను డ్రాప్ చేసేందుకు వెళ్తూ ..
ఐడీఏ బొల్లారం జ్యోతినగర్ కాలనీకి చెందిన ఎమ్మెస్ రెడ్డి, కనక మహాలక్ష్మీ దంపతులు శుక్రవారం టూ వీలర్ వాహనంపై వెళ్తున్నారు. కనక మహాలక్ష్మీ అరబిందో ఫార్మసీలో పనిచేస్తున్నారు. ఆమెను కంపెనీలో డ్రాప్ చేయడానికి రెడ్డి తీసుకెళ్తున్నారు. ముందుగా ఉన్న టాటా ఏస్ డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తీశాడు. ఇంకేముంది రెడ్డి దంపతులు కిందపడిపోయారు. అటు నుంచి వస్తోన్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాల పాలయ్యారు. రక్తపు మడుగులో ఉన్న రెడ్డి అక్కడే ప్రాణాలు వదులగా .. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మహాలక్ష్మీ చనిపోయింది.

పరారీలో ఆటో డ్రైవర్ ..
ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ ను త్వరలో పట్టుకుంటామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications