Telangana Assembly Election Polling: ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..
పలు చోట్లు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని అంబర్‌పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ ఓటు వేశారు.
నల్లగండ్ల గ్రామంలోని బూత్ నెంబర్ 33లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుస్నాబాద్ లో హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల టౌన్లోని కార్మెన్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.

హుస్నాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్..!!!#PonnamPrabhakar #VotingRights #VotingDay #TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaAssemblyElections2023 #TSAssemblyElections2023 #Oneindiatelugu pic.twitter.com/RfKdy6I8yk
— oneindiatelugu (@oneindiatelugu) November 30, 2023












Click it and Unblock the Notifications