అప్పుడు తలసానితో పోరు: ఎవరీ కృష్ణ యాదవ్?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదుకు చెందిన సి. కృష్ణ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చారు. టిడిపిలో వారిద్దరి మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆధిపత్య పోరు సాగుతుండేది. స్టాంపుల కుంభకోణం కేసులో ఇరుక్కోవడం వల్ల కృష్ణా యాదవ్ ప్రాబల్యం టిడిపిలో తగ్గింది. ఒకానొక సందర్భంలో ఆయన టిడిపి నుంచి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు.

రూ. 3 వేల కోట్ల స్టాంపుల కుంభకోణం కేసులో కృష్ణ యాదవ్ 2003 సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. దీంతో ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. 2006 డిసెంబర్‌లో మహారాష్ట్రలోని పూణేలోని యెరవాడ జైలు నుంచి విడుదలయ్యారు. 2007 జూన్‌లో ఆయనపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం కేసు నుంచి ఆయన బయటపడ్డారు.

దాంతో సస్పెన్షన్‌కు గురైన తొమ్మిదేళ్లకు 2012 నవంబర్‌లో తిరిగి కృష్ణ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, ఆ తర్వాత ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. అయినా పార్టీలో కొనసాగుతూ వచ్చారు.

In TDP Krishna Yadav internal fight against Talasani

ఇదే కాలంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీలో తన ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి విజయం సాధించి, ఆ తర్వాత తెరాసలో చేరి మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఈ స్థితిలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కృష్ణా యాదవ్ సంబంధాలు తెరాసలో ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

గ్రేటర్ హైదరాబాదు పరిధిలో యాదవులు రాజకీయంగా ప్రాబల్యం వహిస్తున్నారు. కృష్ణా యాదవ్ పార్టీలో చేరడం వల్ల తెరాసకు కలిసి వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+