Telangana: రాష్ట్రంలో ముఖం చాటేసిన వర్షాలు.. ఆందోళనలో అన్నదాతలు..
వర్షాకాలం వచ్చి నెల రోజులు గడిచినా రాష్ట్రంలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా వర్షం కురుస్తుందన్న నమ్మకంతో నారు పోసుకున్నారు. కానీ వర్షాలు కురవకపోవడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. ఈసారి కూడా రైతులు భారీగా వరి సాగు సిద్ధమయ్యారు. కానీ అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోయేసరికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. పత్తి, మక్క వైపు చూస్తున్నారు. అయితే పత్తి ఇప్పటికే సాగు చేయాల్సి ఉంది.
దీంతో మక్క లేదా ఇతర పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నవారు. మరో నెల రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటే వేసిన వరి నాట్లు కూడా ఎండి పోయే పరిస్థితి వస్తుందని అన్నదాతలు ఆవేదనగా ఉన్నారు. ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టులోకి కూడా నీరు రాలేదు. దీంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని రైతులు వరి సాగు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. ఈ సంవత్సరం 60 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

అయితే ఇప్పటి వరకూ కేవలం 1.71 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు వేశారు. కొన్నిచోట్ల నారుమళ్లు పోసి నెల దాటింది. నీరు లేకపోయేసరికి వర్షాలు కోసం చూస్తున్నారు. పోసిన నారు ముదిరిపోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు జోరువానలు పడితేనే సాగు ముందుకు సాగుతుందని చెబుతున్నారు. వానకాలం సీజన్ లో తెలంగాణలో అన్ని రకాల పంటలు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో సాగవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.
ఇందులో అత్యధికంగా పత్తి 66 లక్షల ఎకరాలు, వరి 60 లక్షల ఎకరాలు, మక్కజొన్న 6 లక్షలు, కందులు 7 లక్షలు, సోయా 4.29 లక్షలు , పెసర లక్ష ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ అధికారులు లెక్క కట్టారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్ప టి వరకూ అన్ని రకాల పంటలు కలిపి 50 లక్షల ఎకరాల పంట మాత్రమే సాగు అయింది. పత్తి 33.81లక్షల ఎకరాల పైచి లుకు సాగు కాగా.. జొన్నలు 20 వేల ఎకరాలు, మక్క 1.92 లక్షలు, కందులు 2.37 లక్షలు, పెసర్లు 35 వేల ఎకరాలు సాగు చేశారు.












Click it and Unblock the Notifications