Multilevel Marketing: వైన్ బాటిల్ పేరుతో కోట్లలో మోసం.. లబోదిబోమంటున్న బాధితులు..
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలను ఎంత అలర్ట్ చేసినా.. మారడం లేదు. మల్టీలెవెల్ మార్కెటింగ్ లో చేరి నష్టపోతున్నారు. ప్రజల అత్యాశ ఆయుధంగా మోసగాళ్లు మోసాలకు తెగపడుతున్నారు. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. మంచిర్యాల జిల్లాలో వైన్ బాటిల్ పేరుతో మోసగాళ్లు కోట్లు కొల్లగోట్టారు.
ఒక బృందంగా ఏర్పడిన మోసగాళ్లు.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పై బాగా ప్రచారం చేశారు. వైన్ కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లు సంపాదించవచ్చని చెప్పారు. ఒక వైన్ సీసా కొనుగోలు చేస్తే.. రెండు నెలల్లో దానికి మూడు రెట్లు ఇస్తామని ఆశ చూపారు. అంతే కాదు కొందరిని జాయిన్ చేస్తే జీతం కూడా ఇస్తామని నమ్మబలికారు. దీంతో కొంత మంది అమాయకులు లక్షల్లో పెట్టుబడి పెట్టారు.

కొద్ది రోజులు చెప్పినట్లుగానే డబ్బులిచ్చారు. దీంతో నమ్మం పెరిగి భారీగా పెట్టుబడులు పెట్టారు. కోట్లలో పెట్టుబడులు వచ్చిన తర్వాత మోసగాళ్లు బోర్డు తిప్పేశారు. దీంతో పెట్టుబడి పెట్టినవారు లబోదిబోమంటున్నారు. ఈ చైన్ మార్కెటింగ్ మోసంలో వేల మంది తమ డబ్బును పోగొట్టుకున్నారు. మోసగాళ్లు ది వైన్ గ్రూప్ పేరు వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. మొదటగా తెలిసిన వారి నంబర్లు యాడ్ చేశారు. ఆ తర్వాత వారి ద్వారా చాలా మంది నంబర్లు యాడ్ చేశారు.
తాము ఒక వైన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని గ్రూప్ లో పోస్ట్ పెట్టారు. గ్రూప్ ఒక లింక్ కూడా పెట్టారు. రూ. 85 వేలతో వైన్ బాటిల్ కొంటే ప్రతి రోజూ రూ. 12,300 చొప్పున చెల్లిస్తారని చెప్పారు. దీన్ని చాలా మంది నమ్మలేదు. ఒకరిద్దరు నమ్మి పెట్టుబడి పెట్టారు. దీంతో వారికి డబ్బులు చెల్లించారు. ఈ విషయాన్న గ్రూప్ పెట్టారు. ఇలా ఒక్కొక్కరిగా దీన్ని నమ్ముతూ పెట్టుబడి పెట్టారు. కొద్ది నెలల పాటు డబ్బులు వచ్చాయి.
దీంతో చాలా పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో 230 మంది చేరిస్తే వారికి నెలకు రూ.20 జీతం ఇస్తామని కూడా చెప్పారు. దీంతో చాలా మంది చైన్ మార్కెటింగ్లో సభ్యులను చేర్పించారు. సదరు మోసగాల్లు మే 30 వరకు డబ్బులు క్రమంగా చెల్లించి తర్వాత కోట్ల రూపాయలతో ఉడాయించారు.












Click it and Unblock the Notifications