కాలేజీ రోజుల్లో మీకు గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారా?... మంత్రి కేటీఆర్ ఓ నెటిజ‌న్ కొంటె ప్రశ్న!

Posted By:
Subscribe to Oneindia Telugu
  పవన్‌, అల్లు అర్జున్, సమంత, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌లపై కేటీఆర్ !

  హైదరాబాద్: ప్రజలకు నిత్యం ఇటు ఆన్‌లైన్‌లో అటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండే మంత్రులలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ముందుంటారనే చెప్పాలి. మంత్రి కేటీఆర్‌కి యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

  ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న చేసే కార్య‌క్ర‌మాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ ఫాలోయింగే ఆయ‌నను 'లీడ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా నిలిపింది.

  In your college Days, You have Girl Friends? An interesting question from a netizen to Minister KTR

  గురువారం ఆయన ట్విట్టర్‌లో నిర్వహించిన 'ఆస్క్ కేటీఆర్' లైవ్ చాట్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు రెండు గంటలకుపైగా నెటిజన్లు అడిగిన రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అభిప్రాయాలు, ప్రశ్నలు, సందేహాలు స్వీకరిస్తూ తగు రీతిలో, తనదైనశైలిలో చమత్కారంగా, సందర్భోచితంగా కేటీఆర్ స్పందించారు.

  ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఓ కొంటె ప్రశ్న వేశాడు. 'కాలేజీ రోజుల్లో మీకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారా?' అని అడిగాడు. దానికి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిస్తూ... 'వారి పేర్లు చెప్పాలని కోరుకుంటున్నావా?' అని అడిగారు.

  'సార్‌కి చాలామంది ఉండి ఉంటారు.. అందుకే అమ్మాయిలు అని బహువచనం వాడారు..' అంటూ మరో నెటిజన్ చురకేశాడు. ఈ చాటింగ్‌లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌తో పాటు, వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌ల‌కు కూడా కేటీఆర్ ఓపిగ్గా స‌మాధాన‌మిచ్చారు.

  నెటిజ‌న్లు కొంటెగా అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న కూడా అదే శైలిలో స‌మాధాన‌మిచ్చారు. అంతేకాకుండా 2017లో జ‌రిగిన అభివృద్ధి గురించి, 2018లో తాము చేయ‌నున్న అభివృద్ధి గురించి కేటీఆర్ నెటిజ‌న్ల‌కు వివ‌రించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A netizen asked Telangana IT Minister KTR in his Live Chat '#AskKTR' that he had girl friends in his college days. For this tricky question KTR replied in his style with a reverse question that 'And you expect me to give you names?'.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి