ముగిసిన జలసంకల్ప హోమం .. కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతికి అంకితం
Recommended Video
తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నేటితో నెరవేరింది . కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కేసీఆర్ అనుకున్నట్టే ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూసిన తెలంగాణా జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు శాస్త్రోక్తంగా వేదం మంత్ర ఉచ్చారణల నడుమ ప్రారంభం అయ్యింది. మహాద్భుత కట్టడంగా ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా 11.23 గంటలకు జాతికి అంకితమైంది.

జల సంకల్ప హోమంలో పాల్గొన్న కేసీఆర్ .. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎంలు, గవర్నర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జల సంకల్ప హోమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ దంపతులు దగ్గరుండి నిర్వహించారు. పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడికి చేరుకున్నారు . వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక యాగాన్ని ముగించిన అనంతరం అతిధులతో ఆత్మీయంగా మాట్లాడారు కేసీఆర్ .

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేసిన కేసీఆర్
అతిథులకు కాళేశ్వరం విశేషాలను స్వయంగా వివరించిన కేసీఆర్, వారితో పాటు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీపై నిర్మించిన రహదారి మార్గాన మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్లి బ్యారేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరికి పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరి తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల రిజర్వాయర్లు, నీటి లభ్యత తదితరాలపై ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఆపై శిలాఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చింది. ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్నిప్రారంభించిన అనంతరం కన్నెపల్లి చేరుకొని 12.30 కి పంపుహౌస్‌ను ప్రారంభించారు.

అతి పెద్ద ఇంజినీరింగ్ అద్భుతం .. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల 45 లక్షల ఎకరాల భూమికి సాగునీరు
ఈ ప్రాజెక్టు వల్ల 45 లక్షల ఎకరాల భూమికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటితోపాటు , తాగునీరు అందించనున్నారు. ఈ రోజు వరకు ప్రభుత్వం రూ .50,000 కోట్లు ఖర్చు చేయగా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ .80,000 కోట్లు. కాళేశ్వరంలో అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతాన్ని మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) కేవలం రెండేళ్లలో నిర్మించింది. భూగర్భ పంప్ హౌస్ మరియు అతిపెద్ద పంపింగ్ పూల్స్ వద్ద 139 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసిన రికార్డును MEIL సృష్టించింది.












Click it and Unblock the Notifications