వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయూత: కేంద్రమంత్రులతో కెటిఆర్, వెంకయ్యకు ఆహ్వానం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేయూతనందించాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లాతో మంచినీరు అందించేందుకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి హడ్కో ద్వారా మరింత రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఒక రోజు పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న మంత్రి కెటిఆర్ గురువారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, రవిశంకర్‌ప్రసాద్‌తో సమావేశమయ్యారు.
రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటును సబ్సిడీ రేట్లకే అందించాలని కోరారు.

హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలిసి చర్చలు జరిపారు. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ టెక్నాలజీపై తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా వెంకయ్యనాయుడిని కేటీఆర్ ఆహ్వానించారు. ఆగస్టు 22, 23 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు తప్పకుండా హాజరవుతాయనని వెంకయ్య హామీ ఇచ్చారు.

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేయూతనందించాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లాతో మంచినీరు అందించేందుకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి హడ్కో ద్వారా మరింత రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

వెంకయ్యనాయుడుతో కెటిఆర్

స్మార్ట్ సిటీలు, స్మార్ట్ టెక్నాలజీపై తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా వెంకయ్యనాయుడిని కేటీఆర్ ఆహ్వానించారు.

హడ్కో సిఎండితో..

హడ్కో సిఎండితో..

అనంతరం హడ్కో చైర్మన్ రవికాంత్‌తో కేటీఆర్ సమావేశమై వాటర్ గ్రిడ్ పథకానికి రుణ అందించాల్సిందిగా కోరారు.

గడ్కరీతో..

గడ్కరీతో..

కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా కెటిర్ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాష్ట్ర రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, మరుగుగొడ్ల నిర్మాణానికి సబ్సిడీ ధరలకు సిమెంటును సరఫరా చేయాలని కోరారు.

రవిశంకర్ ప్రసాద్‌తో..

రవిశంకర్ ప్రసాద్‌తో..

గురువారం సాయంత్రం కేటీఆర్ కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు.

రవిశంకర్ ప్రసాద్‌తో..

రవిశంకర్ ప్రసాద్‌తో..

డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్ లైన్ల నిర్మాణాన్ని వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ నిర్మాణంతో అనుసంధానించాలని, ఫలితంగా సమయంతోపాటు ఖర్చు కూడా కలిసి వస్తుందని వివరించారు.

పట్టణాల అభివృద్ధికి సాయం కోరాం

రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరామని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణలోని ఐదు నగరాలను ఎంపిక చేసినందుకు మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో ప్రారంభించనున్న అమృత్ పథకంలో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ నగరాలను చేర్చాలని కోరినట్లు తెలిపారు. క్లాస్-1 సిటీల జాబితాలో సిద్దిపేటను కూడా చేర్చాల్సిందిగా కోరానని, అందుకు సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు వెంటనే సంబంధిత అధికారులను పిలిచి వివరాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారని చెప్పారు.

అనంతరం హడ్కో చైర్మన్ రవికాంత్‌తో కేటీఆర్ సమావేశమై వాటర్ గ్రిడ్ పథకానికి రుణ అందించాల్సిందిగా కోరారు. ఇప్పటికే ఈ పథకానికి రూ. 10 వేల కోట్ల మేర రుణసాయం చేసిందని, నిబంధనలకు లోబడి మరికొంత ఇవ్వాలని కోరినట్లు మంత్రి తెలిపారు. హడ్కో చైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ అద్భుతమైన ప్రాజెక్టు అని, అందువల్లనే రూ. పదివేల కోట్ల రుణాన్ని ఇచ్చామన్నారు. మరింత రుణం కోసం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం చొరవ తీసుకుంటుందని తెలిపారు.

నితిన్‌గడ్కరీతో భేటీ

కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా కెటిర్ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాష్ట్ర రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, మరుగుగొడ్ల నిర్మాణానికి సబ్సిడీ ధరలకు సిమెంటును సరఫరా చేయాలని కోరారు.
రానున్న నాలుగేండ్లలో రాష్ట్రంలో సుమారు 36 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని, ఇందుకు ఏటా రెండులక్షల టన్నుల చొప్పున సబ్సిడీ ధరకు సిమెంటు అందించాలని విన్నవించారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్థలాన్వేషణ పూర్తి కాగానే రాష్ట్రంలో డ్రై పోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జాతీయ నిర్మాణ సంస్థ ఏర్పాటుపై సమీక్ష కోసం త్వరలోనే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ విభజనపై తుది ప్రకటన చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ
గురువారం సాయంత్రం కేటీఆర్ కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్ లైన్ల నిర్మాణాన్ని వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ నిర్మాణంతో అనుసంధానించాలని, ఫలితంగా సమయంతోపాటు ఖర్చు కూడా కలిసి వస్తుందని వివరించారు.

రాష్ట్రంలో 20,475 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను వేయాల్సి ఉందని, కానీ పనులు ఆశించినంత వేగంగా జరగడంలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న టెక్నాలజీ హబ్‌కు అన్ని అనుమతులు మంజూరు చేసి, ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రవిశంకర్ ప్రసాద్‌కు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.

English summary
IT minister KT Rama Rao made a whirlwind tour of the national capital, Delhi, on Thursday meeting Union ministers and sought funds for various state government’s projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X