ఐటీకి నో హాలీడేస్.. ఆ మూడు రోజుల్లోనూ రిటర్న్స్ దాఖలు చేయొచ్చు!
హైదరాబాద్: ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలు ఈనెల 29, 30, 31 తేదీల్లోనూ తెరుచుకోనున్నాయి. ప్రస్తుత వార్షిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ కార్యాలయాలను తెరిచే ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
పన్ను చెల్లింపుదారులు యధావిధిగా తమ ట్యాక్స్ రిటర్న్స్‌ను దాఖలు చేసుకోవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐటీ కార్యాలయాలు ఈ మూడు రోజుల్లోనూ తెరిచి ఉంటాయని మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

వాస్తవానికి మార్చి 29న మహావీర్ జయంతి, మార్చి 30వ తేదీన గుడ్‌ఫ్రైడే సెలవులు ఉన్నాయి. మార్చి 31వ తేదీన 2017-18 ఆర్థిక సంవత్సర చివరి తేదీ కావడం విశేషం. ఈ మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులను మూసివేయనున్నారు. కానీ ఐటీ ఆఫీసులు మాత్రం మూతపడవు.












Click it and Unblock the Notifications