Telangana: తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తాజాగా ఓ సర్వే సంస్థ సర్వే ఫలితాలు విడుదలచేసింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే పేర్కొంది. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ. బీఆర్ఎస్‌కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా.. ఇండియా టీవి ఫలితాలు మాత్రం బీఆర్ఎస్ అధికారం దక్కుతుందని పేర్కొంది.
లోక్ పోల్ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు 41 శాతం నుంచి 44 శాతం ఓట్లతో 61 నుంచి 67 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ 39 నుంచి 42 శాతం ఓట్లతో 45 నుంచి 51 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. బీజేపీ 10 నుంచి 12 శాతం ఓట్లతో 2 నుంచి 3 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎంఐఎం 3 నుంచి 4 శాతం ఓట్లతో 6 నుంచి 8 సీట్లు సాధించే అవకాశం ఉందని లోక్ పోల్ అంచనా వేసింది.

ఏబీపీ-సీ ఓటర్ ప్రకారం కాంగ్రెస్ 48 నుంచి 69 సీట్లు.. బీఆర్ఎస్ కు 43 నుంచి 55 స్థానాలు, బీజేపీ 5 నుంచి 11 స్థానాలు, ఇతరులు 5 నుంచి 11 చోట్లు గెలుస్తారని అంచనా వేశారు. పోల్ ట్రాకర్ ప్రకారం కాంగ్రెస్ 63 నుంచి 69 స్థానాలు, బీఆర్ఎస్ 35 నుంచి 40 చోట్ల, బీజేపీ 3 నుంచి 5 నియోజకవర్గాల్లో, ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది.
తెలంగాణ పల్స్ సర్వే చూస్తే.. కాంగ్రెస్ కు 62 నుంచి 69 సీట్లు, బీఆర్ఎస్ 46 నుంచి 54, బీజేపీకి 3 నుంచి 6, ఎంఐఎంకు 5 నుంచి 7చోట్ల విజయం సాధిస్తాయని అంచనా వేశారు. జన్ మత్ ప్రకారం కాంగ్రెస్ 58 నుంచి 60 స్థానాల్లో, బీఆర్ఎస్ 45 నుంచి 47చోట్ల, బీజేపీ 6 నుంచి 7 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు 2 నుంచి 3 చోట్ల విజయం సాధిస్తుందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications