దేశంలో ప్రగతిని డబుల్ డెక్కర్ రైళ్లతో పరుగులు పెట్టించనున్న రైల్వే!

భారతీయ రైల్వే.. ప్రగతి రథ చక్రాలతో దూసుకుపోతుంది. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సేవలను అందిస్తున్న భారతీయ రైల్వే ఇప్పుడు సరికొత్త రైళ్ళను తీసుకురావడానికి రెడీ అయింది.

డబుల్ డెక్కర్ రైళ్ళ ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు
గూడ్స్ కమ్ ప్యాసింజర్ డబల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సరికొత్త ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. భారతీయ రైల్వే డబుల్ డెక్కర్ రైళ్ళను ప్రారంభించడానికి శరవేగంగా సన్నాహాలు చేస్తోంది.

Indian Railways to accelerate progress in the country with double-decker trains

ప్రారంభ దశలో రెండు రైళ్ళను రూపొందిస్తున్నారు
అయితే ఇప్పటికే భారత దేశంలో డబుల్ డెక్కర్ రైలు నడుస్తున్నప్పటికీ ఆ సంఖ్య తక్కువగా ఉండడమే కాకుండా అందులో కేవలం ప్రయాణికులు మాత్రమే ప్రయాణాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా సరుకు రవాణాతో పాటు ప్రయాణికులను చేరవేసే దిశగా డబల్ డెక్కర్ రైళ్ళను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నివేదికల ప్రకారం ప్రారంభ దశలో రెండు రైళ్ళను రూపొందించే ఆలోచన చేస్తుంది.

ఒక్కో కోచ్ తయారీకి నాలుగు కోట్లు
భారతీయ రైల్వే. ఇకపై రూపొందే రైళ్లు ఒకేసారి ప్రయాణికులతో పాటు సరుకులను కూడా రవాణా చేయనున్నాయి. ఇక ఈ డబుల్ డెక్కర్ రైళ్లను తయారు చేయడం కోసం కోచ్ ల తయారీకి సంబంధించి ప్రణాళికలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సరుకు రవాణా తో పాటుగా ప్రయాణికులు వెళ్లేందుకు తయారయ్యే ఈ ఒక్కొక్క కోచ్ ధర సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కోచ్ ల తయారీ
ఇక ఈ డబుల్ డెక్కర్ కోచ్ తయారీ కోసం కపుర్తలలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రోటో టైప్ ను డెవలప్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పది కోచ్ లను తయారు చేశారు. ఏది ఏమైనా ప్రయాణికులకు సేవలు అందించడంతోపాటు కార్గో సేపులను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్న మంత్రిత్వ శాఖ ఈ తరహా డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి శరవేగంగా పనిచేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+