తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం .. ప్రతి సోమవారం వారి ఖాతాల్లోకి డబ్బులు..
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఇందిరమ్మ ఇళ్లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇదీ ఒకటి. అయితే ఈ పథకానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు3 లక్షల ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం ఒకటి. పేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్రంలోని అర్హులైన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులను ప్రతి సోమవారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి కీలక విషయాలు వెల్లడించారు. వీటిల్లో 2.37 లక్షల ఇళ్లకు ఇప్పటికే మంజూరు పత్రాలు అందించామన్నారు. మరో 1.23 లక్షల ఇళ్లు నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రూ. 5 లక్షలతో ఇళ్లను నిర్మించి ఇవ్వట్లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 23వ తేదీ నాటికి జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన 95 నియోజకవర్గాలకు గాను 88 అసెంబ్లీ స్థానాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ తదితర జిల్లాల పనితీరు ఇంకా మెరుగుపడాలని ఈ మేరకు అధికారులకు సూచించారు.

మరోవైపు రాష్ట్రంలోని అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇటీవల తెలిపారు. జగిత్యాల జిల్లా, బుగ్గారంలో 191 మంది లబ్ధిదారులకు ఇటీవల ఆయన పత్రాలను అందించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తుందని తెలిపారు. అంతేకాక సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications