క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మరో శుభవార్త!

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నగరంలోనూ ముఖ్యంగా క్యూర్ పరిధిలో ఇల్లు లేని, సొంతింటి స్థలం కూడా లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణా సర్కార్ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేసి వారికి ఇవ్వనుంది.

ఈ క్రమంలో ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న వారికి ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుల పరిశీలనతో పాటు లాటరీ ద్వారా ఫ్లాట్ లను కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ఇందులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిశీలనలో ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో స్థానికుల సంఖ్య ఇళ్ల కేటాయింపుకు సరిపోకపోవడం గుర్తించారు.దీంతో మిగిలిన ఇళ్ల కోసం స్థానికులుగా నిర్ధారణైన దరఖాస్తుదారులతో మరోసారి లాటరీ నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Indiramma Houses in Hyderabad Locals in Ibrahimpatnam and Khairatabad get second lottery chance

కూకట్‌పల్లిలో కూడా తగిన స్థానికులు లేకపోతే మరో డ్రా చేసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి 600 మంది చొప్పున 480 మంది ప్రధాన జాబితా, 120 మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఎంపికయ్యారు. అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.

ఎంపిక కాని వారికి దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10 వేలు ప్రభుత్వం రిఫండ్ చేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో తుది జాబితా ఖరారు కాకపోవడంతో రిఫండ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దరఖాస్తులో నియోజకవర్గ వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో సవరణకు అవకాశం కల్పించారు. అప్లికేషన్ నంబర్, ఫోన్ నంబర్ లేదా ఆధార్ వివరాలతో లాగిన్ అయి మార్పులు చేసుకోవచ్చు.

టీజీ ఈ-టికెట్‌ యాప్‌... తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!
టీజీ ఈ-టికెట్‌ యాప్‌... తెలంగాణాలో వాహన దొంగలకు ఇక చుక్కలే!

ఎంపికైన వారికి సోమవారం నుంచి వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు పంపనున్నారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టీజీహెచ్‌బీ తెలిపింది. స్థానికులకు మరోసారి అవకాశం దక్కే అవకాశం ఉండటంతో మరోసారి లాటరీలో రానివారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+