చెత్తకుప్పలో పసికందు మృతదేహం..తల్లి ఇంటర్ చదివే మైనర్ బాలిక ? ఈ పాపం ఎవరిది ?
అభం శుభం తెలియని, అసలు లోకమే తెలియని పసికందులను మొగ్గలోనే తుంచేస్తున్నారు. నవమాసాలు మోసి కని నిర్దాక్షిణ్యంగా, కనికరం లేకుండా చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. ఏ తల్లుల కన్న బిడ్డలో ముళ్లపొదల్లో, చెత్త కుప్పలలో , మురికి కాల్వల ప్రక్కన, కుక్కలు, పందులు పీక్కుతింటూ, చీమలకు ఆహారంగా మారుతూ కనిపిస్తున్న సంఘటనలు మనసులను కలచివేస్తున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన తల్లికి చేతులు ఎలా వచ్చాయి అన్న భావనను కలిగిస్తున్నాయి.

నిత్యం చెత్త కుప్పల్లో, మురికి కాల్వలలో విగతజీవులుగా పసికందులు
అమ్మ.. తన బిడ్డల కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యగల గొప్ప త్యాగమూర్తి. నవమాసాలు మోసి కన్న బిడ్డ కోసం తల్లి చేసే సాహసాలు అంతా ఇంతా కాదు. ఎంతటి కష్టాన్నయినా తట్టుకుని బిడ్డలను పెంచడానికి తల్లులు పడే తపన నిరుపమానమైనది. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని, కనీసం బొడ్డు కూడా ఊడకముందే వద్దనుకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు. నిత్యం అనేక చోట్ల చెత్త కుప్పలలో, మురికి కాలవలలో విగతజీవులుగా పడి ఉంటున్న పసికందులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. తమ చావుతో ఆ తల్లులను, తమ పరిస్థితి కారణమైన ఈ లోకాన్ని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

నిజామాబాద్ లో దారుణం.. చెత్తకుప్పలో శిశువు మృతదేహం
ఇక తాజాగా నిజామాబాద్ నగరంలోని ఖాలీల్ వాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద చెత్తకుప్పలో పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రక్తం ముద్దులా, కుక్కలు, పందులు పీక్కు తిన్నట్లుగా ఉన్న పసికందు మృతదేహాన్ని చూసినవారంతా చలించిపోయారు. మునిసిపల్ కార్మికులు నారాయణ, భాస్కర్ అనే ఇద్దరు పసికందు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తులు పసికందును పడేసి వెళ్ళినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా శిశువు మృతదేహాన్ని పడేసిన వారిని గుర్తించే పనిలో పడిన పోలీసులు ఈ కేసులో షాకింగ్ విషయాలను గుర్తించారు.

పసికందుకు జన్మనిచ్చిన తల్లి ఇంటర్ విద్యార్థిని, ఓ మైనర్ బాలిక ?
పసికందు మృతదేహాన్ని పడేసి వెళ్లిన వాళ్లను గుర్తించిన పోలీసులు ఎమ్ ఎస్ ఫారం కు చెందిన ఓ యువతి బోధన్ లో ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతుంది అని, కడుపు నొప్పిగా ఉందని ఆసుపత్రికి వచ్చిన క్రమంలో, ఆసుపత్రి వైద్యులు గర్భిణీగా గుర్తించి డెలివరీ చేశారని సమాచారం. పోలీసులు సదరు యువతిని, ఆమె తల్లిని విచారించగా తనకు తెలియకుండానే తన కడుపులో బిడ్డ పెరిగిందని, పోలీసులకు గందరగోళంగా సమాధానం చెబుతోంది. ఇక ఈ రోజు పోలీసులు విచారించడంతో సదరు యువతి చెత్తకుప్పలో దొరకింది తన బిడ్డని అంగీకరించింది. ఆసుపత్రి వైద్యులు కూడా ఆమెకు డెలివరీ చేసినట్లు నిర్ధారించారు. అయితే పసికందు చనిపోయిందా? లేక చంపి పడేశారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

నిత్యకృత్యంగా మారుతున్న ఘటనలు, అమ్మతనానికే మాయని మచ్చ
ఇక ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో నిత్యకృత్యంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మైనర్ కావడం ఒక షాక్ అయితే, 9 నెలలు తన గర్భంలో బిడ్డ ఉన్నాడనే విషయమే తెలియదని ఆమె చెప్పడం మరొక షాకింగ్ అంశం . ఇక అన్నిటికంటే ఏ పాపము చేయకుండా భూమి మీదికి వచ్చిన బిడ్డ తన ప్రమేయమే లేకుండా జరిగిన పాపానికి బలైపోవడం, చెత్తకుప్ప పాలు కావడం మాత్రం అన్నిటికంటే దారుణమైన విషయం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications