హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వాక్సీన్ తయారీలో సత్తా చాటుకోనున్న భారత్..!హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వినూత్న ప్రయోగాలు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వాక్సీన్ తయారీ ప్రయోగాలలో పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాల్లో అమెరికా, బ్రిటన్, జపాన్, చైనా, ఆస్ట్రేలియా తో పాటు భారతదేశం కూడా వాక్సీన్ తయారీలో కీలక ప్రయోగాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రాణాంతక మహమ్మారికి విరుగుడు వాక్సీన్ ఇంతవరకూ కనిపెట్టలేకపోవడంతో ప్రపంచ దేశాల మీద కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టే తగ్గుతూ మళ్లీ విజృంభిస్తుండడంతో కరోనా పీడిత దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా దెబ్బ- 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు- పరిమిత సర్వీసులే కారణం..ఏపీఎస్ ఆర్టీసీపై కరోనా దెబ్బ- 4 వేల మంది ఉద్యోగుల తొలగింపు- పరిమిత సర్వీసులే కారణం..

 కరోనా వ్యాక్సీన్ తయారీలో వేగం.. హైదరాబాద్ లో జరుగుతున్న కీలక ప్రయోగాలు..

కరోనా వ్యాక్సీన్ తయారీలో వేగం.. హైదరాబాద్ లో జరుగుతున్న కీలక ప్రయోగాలు..

దీంతో పాటు కరోనా వాక్సీన్ తయారీ కోసం వేగవంతమైన ప్రయోగాలు జరుగుతునన్నట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో కూడా కరోనా వాక్సీన్ కోసం చురుకైన ప్రయోగాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ వైద్యులు ఇదే అంశాన్ని నిర్ధారిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన శాంతబయోటెక్స్ ఔషద ప్రయోగశాలలో కూడా ఇందుకు సంబంధించిన ప్రయోగాలు వేగంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయా ఔషద సంస్థలను పెద్దయెత్తున ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.

 కరోనా వ్యాక్సీన్ తయారీలో ప్రయోగాలు జరుగుతున్నాయి.. త్వరలో ఆశించిన ఫలితాలు వస్తాయన్న కేసీఆర్..

కరోనా వ్యాక్సీన్ తయారీలో ప్రయోగాలు జరుగుతున్నాయి.. త్వరలో ఆశించిన ఫలితాలు వస్తాయన్న కేసీఆర్..

కరోనా వ్యాక్సీన్ తయారీలో భారత దేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దేశం, రాష్ట్రం వేరువేరు కాకపోయినప్పటికి హైదరాబాద్ నుండి కరోనా వ్యాక్సీన్ తొలిసారి కనిపెట్టగలిగితే దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణంగా పరిణమిస్తుంది. ప్రతి తెలుగువాడు ఇదే అంశంపై గొప్పగా చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. ఇదే అంశాన్ని ఇటీవల ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యాక్సిన్ తయారీ గురించి ప్రస్తావించారు. ఆగస్టులోపు వ్యాక్సిన్ వస్తుందని, అది కూడా మన ఇండియా నుంచే, హైదరాబాదు నుంచే వస్తుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పడం గమనార్హం.

 ఔషద కేంద్రాలకు అడ్డాగా మారిన జీనోమ్ వ్యాలీ.. హైదరాబాద్ నుండి వ్యాక్సీన్ వస్తే గర్వకారణమే..

ఔషద కేంద్రాలకు అడ్డాగా మారిన జీనోమ్ వ్యాలీ.. హైదరాబాద్ నుండి వ్యాక్సీన్ వస్తే గర్వకారణమే..

అంతే కాకుండా ప్రగతిభవన్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని నొక్కి వక్కాణించారు చంద్రశేఖర్ రావు. అయితే హైదరాబాదు నుంచి వ్యాక్సిన్ వచ్చినా, ప్రపంచం నుంచి వేరే ఏ దేశం నుంచి వచ్చినా, భారతీయులతో పాటు తెలుగు వారికి కూడా ప్రశంసలందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ఈ ప్రపంచంలో అత్యధిక మోతాదులో అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగలిగిన సదుపాయాలు కేవలం హైదరాబాదులోని ఫార్మా కంపెనీలకు ఉన్నాయి. హైదరాబాదు ప్రపంచ ఫార్మా హబ్ లో ప్రముఖస్ధానంలో కొనసాగుతోంది. ఈ కారణం వల్లే మలేరియా వాక్సీన్ ను ఇటీవల 55 దేశాలకు ఎగుమతి చేసిన అంశంపై చర్చ జరుగుతోంది.

 ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపే.. వ్యాక్సీన్ తయారీలో వేగవంతమైన ప్రయోగాలు..

ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపే.. వ్యాక్సీన్ తయారీలో వేగవంతమైన ప్రయోగాలు..

ప్రముఖ ఔషద సంస్థలతో పాటు పరిశోధనా కేంద్రాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయి. ఔషద సంస్తలన్నింటిని గత ప్రభుత్వాలు ఒకచోటకు చేర్చి జీనోమ్ వ్యాలీగా నామకరణం చేశాయి. ఇపుడు ప్రపంచంలో వ్యాక్సిన్ పై అలుపెరగని ప్రయోగాలు చేస్తున్న కేంద్రాల్లో ఈ జీనోమ్ వ్యాలి ప్రయోగాలు కూడా కీలకంగా మారాయి. ఫార్మా రంగంలో దేశానికున్న బ్రాండ్ కాకుండా, ప్రపంచస్థాయి సదుపాయాల వల్ల వ్యాక్సిన్ కనిపెట్టే అవకాశాలు హైదరాబాద్ కే ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రపంచంలో అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీ కోసం భారతదేశం మీదే ఆధారపడే అవకాశం ఉంది.

English summary
There seems to be rapid experiments for corona vaccine preparation. Across the globe, there are active trials for the corona vaccine in the Genome Valley of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X