21ఏళ్ల నేరగాడికి క్రైం సీరియళ్లే స్ఫూర్తి: వివాహేతర సంబంధం, జల్సాలు, కిడ్నాపులు, హత్య

అతని వయస్సు 21ఏళ్లే. చదివింది బీకాం. కానీ, చేసేవన్నీ క్రిమినల్ పనులే. ఇందుకు అతడ్ని ప్రోత్సహించినవి క్రైం సీరియళ్లేనట. వివాహేతర సంబంధాలు, జల్ల్సాలు, కిడ్నాపులతో మొదలై హత్యలతో అతని జీవితం మరింత

హైదరాబాద్: అతని వయస్సు 21ఏళ్లే. చదివింది బీకాం. కానీ, చేసేవన్నీ క్రిమినల్ పనులే. ఇందుకు అతడ్ని ప్రోత్సహించినవి క్రైం సీరియళ్లేనట. వివాహేతర సంబంధాలు, జల్ల్సాలు, కిడ్నాపులతో మొదలై హత్యలతో అతని జీవితం మరింత దుర్మార్గంగా తయారైంది. చివరకు అతని నేరాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలడంతో అతడ్ని కటకటాల వెనక్కినెట్టారు. ఆ నిందితుడే నగరానికి చెందిన షేక్ మున్నీరుద్దీన్(21).

షేక్ నేరాల చిట్టాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. బండ్లగూడ జహంగీరాబాద్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ మునీరుద్దీన్‌.. సంతోష్‌నగర్‌లోని ఓ కళాశాలలో బీకాం ఫస్టియర్‌ చదువుతున్నాడు. పుస్తకాలమీద ధ్యాస వదిలేసి క్రిమినల్‌ సీరియల్స్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేసేవాడు. స్నేహితులతో నేరాలకు సంబంధించిన అంశాలనే చర్చించేవాడు. తాను చూసే సీరియల్స్‌లో కిడ్నాప్‌ కహానీ బాగా ఆకట్టుకుంది. తాను కూడా అలాచేసి డబ్బు సంపాదించి డాన్‌గా ఎదగాలనుకునేవాడు.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతడు ఆలోచన అమలు చేయాలనే పథకం వేశాడు. అతడి ఇంటిపక్కనే ఉండే మహ్మద్‌ యావజుద్దీన్‌, పర్హత్‌బేగం కుమారుడు మహ్మద్‌ ఉరూజుద్దీన్‌ అహ్మద్‌(12) ఏడో తరగతి పూర్తిచేశాడు. వేసవి సెలవులు కావడంతో మదర్సాలో అరబిక్‌ నేర్చుకునేందుకు వెళ్లేవాడు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల సమయంలో బాలుడు అరబిక్‌ క్లాస్‌కు వెళ్లటం మునీరుద్దీన్‌ గమనించాడు.

Inspired by Telugu serial youth kills minor in Hyderabad

ఈ క్రమంలో ఏప్రిల్ 28వ తేదీన బైక్‌పై సరదాగా తిప్పుతానని బాలుడిని తన వెంట తీసుకెళ్లాడు. మొగల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వెనుక వైపు ఉన్న జహంగీరాబాద్‌ నీటి కుంట వద్దకు చేరారు. బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు అతడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్‌ చేద్దామనే ప్లాన్‌ వేశాడు. చివరి నిమిషంలో భయమేసి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఈ విషయం బయటకు తెలిసినా, బాలుడిని ఇంటికి తీసుకెళ్లినా తన కుటుంబం పరువు పోతుందని, పోలీసులు పట్టుకుంటారని భయపడ్డాడు. బాలుడి గొంతు నులిమి చంపేశాడు. అతడి దుస్తులు తొలగించి కాల్చివేశాడు. మృతదేహాన్ని నీటిగుంటలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

బాలుడిని హత్యచేసిన మునీరుద్దీన్‌ అదేరోజు ముంబై వెళ్లాడు. ఐదురోజుల అక్కడే తిరుగుతూ బుధవారం హైదరాబాద్‌ వచ్చాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అహ్మద్‌ మరణంతో తనకు సంబంధం లేదని... తనకు తమ్ముడు లాంటి వాడంటూ ముందుగానే లెటర్‌ రాసిపెట్టి మాయమయ్యాడు. ఏమీ తెలియనట్టు నగరానికి చేరి సరదాల్లో మునిగిపోవాలనుకున్నాడు. కాగా, అప్పటికే సీసీ ఫుటేజీ వివరాలు సేకరించిన ఇన్‌స్పెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి.. నిందితుడు మున్నీరుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయాన్ని వెళ్లగక్కాడు.

కాగా, మున్నీరుద్దీన్ తండ్రికి కంటిచూపు సరిగాలేదు. పెద్ద కుటుంబంలో ఇతడే చివరివాడు. అతడి అన్నయ్య రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అన్నయ్య సంపాదనే కుటుంబానికి ఆధారం. మునీరుద్దీన్‌ మాత్రం ఇరవైఏళ్ల వయసుకే జల్సాలకు బానిసగా మారాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సరదాలకు, షికార్లకు కావాల్సిన డబ్బు కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చమంటూ ఒత్తిడి రావటంతో కిడ్నాప్‌ చేసి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. అది బెడసికొట్టడంతో హంతకుడిగా మారాడు. బాలుడి మరణతో అతడి తల్లిదండ్రులు శోకసంద్రలో మునిగిపోయారు.

నిందితుడిని పట్టుకున్నారిలా..

మదర్సాకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవటంతో 29వ తేదీన బాలుడు ఊరూజుద్దీన్ అహ్మద్ తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు. బాలుడు మాయమైన రోజు మునీరుద్దీన్‌ బైక్‌పై ఉరూజుద్దీన్‌ను తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాలో ఫుటేజీ లభించింది. మునీరుద్దీన్‌ కూడా అజ్ఞాతంలో ఉండటంతో నిందితుడు అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

గురువారం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. బాలుడ్ని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు మునీరుద్దీన్. మృతదేహాన్ని పాతిపెట్టిన గుంత వద్దకు పోలీసులను తీసుకెళ్లాడు. బాలుడి మృతదేహాన్ని బయటకుతీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. తమ కుమారుడి ప్రాణాలు తీసిన మున్నీరును కఠినంగా శిక్షించాలని ఉరూజుద్దీన్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+