వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకరి చావుకు కారణమైన టివి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :టివిలు, సినిమాలు మనుషులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. చానల్స్ పెరిగిన తర్వాత టివికి అతుక్కుపోయే వారి సంఖ్య పెరుగుతోంది. తమకు నచ్చిన కార్యక్రమాన్ని చూసేందుకు వీక్షకులు పనులను కూడ పక్కనపెడుతుంటారు. ముఖ్యంగా సీరియల్స్ సమయంలో విషయంలో మహిళలు ఆ సమయంలో టివిలకే అతుక్కుపోతారు.అయితే అతిగా టివిలు చూడడం కూడ ప్రమాదకమే అయింది. తనకు నచ్చిన చానల్ చూడనివ్వనందుకు ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహాత్య చేసుకొంది.

హైదరాబాద్ లోని ఎస్ పి ఆర్ హిల్స్ సమీపంలోని సంజయ్ నగర్ లో ఉండే షహానా బేగం టివిలో నచ్చిన చానల్ చూడనివ్వలేదని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న షహానా బేగం ఆదివారం నాడు ఇంట్లో టివి చూస్తోంది. తనకు ప్రోగ్రాం ను చూస్తోంది.అయితే ఆమె సోదరుడు పదే పదే చానల్ మార్చుతూ ఆమెను ఇబ్బంది పెట్టాడు.

inter student sucide for tv

చానల్ పదే పదే మార్చడంతో వారిద్దరి మద్య గొడవ జరిగింది.కోపం పట్టలేక తమ్ముడు సమీర్ అక్క షహానాను కొట్టాడు.తల్లి కూడ సోదరినే సపోర్ట్ చేసింది. టివి చూస్తూ కాలక్షేపం చేసే బదులు ఇంట్లో పనికి సహాయపడాలని చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన షహానా గదిలోకి వెళ్ళిచున్నీతో ఉరివేసుకొంది.కొద్దిసేపటికి షహానా గదిలోకి వెళ్ళిన మరో సోదరికి ఫ్యాన్ కు వేలాడుతున్న షహానా బేగం కన్పించింది.

ఆత్మహాత్యకు ప్రయత్నించిన షహానా బేగం ను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. చిన్న విషయానికే ఆత్మహాత్యకు పాల్పడడం ఇబ్బందికల్గిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు..

English summary
inter first year student sucide because of tv channel change.on sunday sahana begum watching tv in her house at sanjaynagar near sprhills. her brother samer repeatedly change the tv channel. bothe are stir.sameer attak his sister sahana, her mother also support to sammer. she feel very sad , then sucide said police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X