సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ.. ఏ ఏ అంశాలు ప్రస్తావించారు అంటే ?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో మందకృష్ణతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను అభినందనీయమని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలానే ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు మందకృష్ణ మాదిగ వివరించారు.

రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి ఆ తర్వాతా న్యాయ కమిషన్ వేసి నివేదికలను వేగంగా తీసుకున్నామన్నారు. ఆ తర్వాత దానిపై కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా ముఖ్యమంత్రి వివరించారు.

interesting points in mandakrishna Madiga and cm revanth Reddy meeting

అంతే కాకుండా గతంలో వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. షెడ్యూల్డు కులాల వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సిఫారసులను శాసనసభ ఆమోదించింది. అయితే కమిషన్ చేసిన సిఫారసుల్లో క్రిమీలేయర్ ప్రతిపాదనను మాత్రం తిరస్కరించింది.

ఇక మిగతా వర్గీకరణ ప్రతిపాదనలను శాసనసభ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గకరణ తొలి నుంచి మద్దతు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్ పర్సెంటేజ్‌ల గురించి ప్రస్తావించామన్నారు. గతంలో కొన్ని కులాలను వేరే గ్రూపులో చేర్చారన్నారు. న్యాయబద్దమైన డిమాండ్లను పరిశీలించి ముఖ్యమంత్రి తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+