రాజ్ భవన్ లో ఆసక్తిక సన్నివేశం.!ఈటల బుజం తట్టి శభాష్ అన్న గవర్నర్.!

హైదరాబాద్ : గవర్నర్ అధికార నివాసం రాజ్ భవన్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరి ధాన్యాల కేంద్రాల వద్ద పరిస్దితులు ఏవిధంగా ఉన్నాయి.. రైతుల మనోభావాలు ఏవిదంగా ఉన్నయో తెలుసుకునేందుకు బీజేపి రాష్ట్ర అద్యక్షుడి హోదాలో బండి సంజయ్ కుమార్ గత రెండు రోజుల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. రైతుల నుండి భారీగా స్పందన వస్తుండం, రైతులు తమ కష్టాలను నేరుగా బండి సంజయ్ కి మొరపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతులు.

వరి కొనుగోలు కేంద్రాల వద్ద, నిల్వచేసిన సెంటర్ల వద్దకు బండి సంజయ్ నేరుగా వెళ్తూ రైతుల కష్టసుఖాలను తెలసుకుంటున్నారు.అసలు సమస్య ఇక్కడే మొదలైనట్టు తెలుస్తోంది. బండి సంజయ్ పర్యటనను అడ్డుకోవాలని భావిస్తున్న కొంత మందిొ ఇతర పార్టీ నేతల బండి సంజయ్ వాహణ శ్రేణిపై రాళ్లు, కోడిగుడ్ల దాడికి యత్నించారు. దీంతో బండి సంజయ్ యాత్రలో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Interesting scene in Raj Bhavan!

ఇక ఇదే అంశాన్ని గవర్నర్ తమిళ్ సై కు వివరించేందుకు బీజేపి ముఖ్య నేతలు రాజ్ భవన్ చేరుకున్నారు. ఇటీవల హుజురాబాద్ లో గెలుపొందిన ఈటల రాజేందర్ కూడా గవర్నర్ ను కలిసిన బృందంలో ఉన్నారు. కాగా బీజేపీ నేతలతో కలసి రాజ్ భవన్ కు వెళ్ళిన ఈటల రాజేందర్ కు ఊహించని సంఘటన ఎదురైనట్టు తెలుస్తోంది. హోరా హోరీగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాకుండా ఈటల రాజేందర్ ను ప్రత్యేకంగా పిలిచి బాగా కష్టపడి గెలిచారని భుజం తట్టారు గవర్నర్ తమిళ్ సై. కష్టపడితే ఫలితం అదే తమవుతుందనే అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ తెహుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని గవర్నర్ తో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపి ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+