శ్రీచైతన్యలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య
నార్సింగి లోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
నార్సింగి లోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లోనే ఉరివేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇతర విద్యార్థుల ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని, కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదని విద్యార్థులు చెప్పారు.
వారే యట ఒక వాహనాన్ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దగ్గరలో హాస్పటల్ ఉంటే అక్కడకు తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్ మృతిచెందడటంతో సాత్విక్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

కాలేజీ యాజమాన్యం చేసిన ఒత్తిడివల్లే తమ కుమారుడు మరణించాడంటూ సాత్విక్ తల్లిదండ్రులు, బంధువులు శ్రీచైతన్య కాలేజ్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్, వార్డెన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ధర్నాకు దిగిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడ్డుకున్నారు. హాస్టల్ నుంచి విద్యార్థులందరినీ యాజమాన్యం పంపించి వేసింది. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా? అంటూ సాత్విక్ తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications