అంతర్జాతీయ మిఠాయిల పండుగ.. వెయ్యికి పైగా నోరూరించే స్వీట్స్ !
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అంతర్జాతీయ మిఠాయిల పండుగను నిర్వహిస్తోంది. పతంగుల పండుగతో పాటు పరేడ్ మైదానంలో ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు మిఠాయిల పండుగ జరగనుంది.
ఈ ఫెస్టివల్‌లో వెయ్యికి పైగా నోరూరించే మిఠాయిలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం సచివాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సహా పలువురు అధికారులు విడుదల చేశారు.

నగరంలో నివాసముంటోన్న సుమారు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు నోరూరించే రకరకాల మిఠాయిలను ఇంటి నుంచే తయారుచేసి పరేడ్ గ్రౌండ్‌కు తీసుకురానున్నారని తెలిపారు.
మినీ భారతాన్ని ఆవిష్కరించే వేదికగా దేశంలోనే తొలిసారిగా ఈ అంతర్జాతీయ మిఠాయిల పండుగను నిర్వహిస్తున్నట్లు మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. సరికొత్త తరహాలో జరిగే ఈ వేడుకలకు సుమారు లక్ష మందికిపైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications