ఇరాన్ అధ్యక్షుడు హసన్ హైద్రాబాద్ టూర్: కుతుబ్‌షాహీ సమాధుల సందర్శన
Recommended Video

హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ శుక్రవారం నాడు కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించాడు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం హసన్ రౌహనీ గురువారం రాత్రి హైద్రాబాద్ కు వచ్చారు.
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ హసన్ రౌహానీ రెండో రోజు నగరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం షేక్‌పేట్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను రౌహనీ సందర్శించారు. కుతుబ్‌షాహీ సమాధుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మక్కామసీదుకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

స్వాతంత్ర్యం అనంతరం మక్కామసీదును సందర్శించిన తొలి విదేశీ దేశాధినేత హసన్ రౌహానీయే కావడం విశేషం.నగరంలో ముస్లిం ప్రముఖులు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు, మేధావులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ఇతర దేశాలతోనూ తమకు శతృత్వం లేదని రౌహాని పేర్కొన్నారు. సమస్యలకు పొరుగుదేశాలతో ఘర్షణలు, ఉగ్రవాదం పరిష్కారంకావని, చర్చలు, దౌత్యసంబంధాలతోనే పరిష్కరించుకోవచ్చన్నారు.ఉగ్రవాద ఘటనలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆటంకంగా మారాయని రౌహాని ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications