హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమానాల్లో వచ్చేసి చైన్లు తెంపుకెళ్తారు: హోటల్ భోజనమే చేస్తారు (ఫొటో)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మూడో తరగతి వరకే చదివాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దాంతో అప్పులు పెరిగాయి. దాంతో సులభంగా డబ్బు సంపాదించడానికి చోరీల దారి పట్టాడు. ఇప్పుడు దొంగతనాలు చేసేందుకు విమానాల్లో చెక్కర్లు కొడుతున్నాడు. అతను ఇరానీ గ్యాంగ్ నాయకుడు తకీ అలీ. బంగారు గొలుసులు లాగడంలో దిట్ట అయిన తన సోదరుడు సల్మాన్‌తో కలిసి గొలుసు చోరీలకు పాల్పడుతున్నాడు.

ఆ ఇరానీ గ్యాంగ్ లీడర్‌ను సైబరాబాద్ పోలీసులు పట్టేశారు. తఖీ అలీ నేతృత్వంలోని ఇరానీ గ్యాంగ్ 2012 నుంచి 2015 వరకు 121 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి, సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. నగరంలో అడుగు పెట్టిందే తడవుగా మూడు గంటల వ్యవధిలో 25 తులాల బంగారం గొలుసులు కొట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారని పోలీసులు తెలిపారు. మూడు గంటల్లో వీరు రూ. 7.50 లక్షలను సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ ఇరానీ గల్లీ ప్రాంతానికి చెందిన తఖీ అలీ(31) వృత్తి రీత్యా స్నూకర్ వ్యాపారి. అతడి పూర్వీకులు ఇరాన్ నుంచి బీదర్‌కు వలస వచ్చారు. బీదర్‌లో స్థిరపడ్డ తఖీ అలీ రెండు వివాహాలు చేసుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో తన స్నూకర్ పార్లర్‌కు వచ్చే రాథే, గులాం, అబ్బాస్, మెండీతో కలిసి 2008లో ముఠాను ఏర్పాటు చేశాడు.

Irani gang nabbed by Cyberabad police

అతడి సోదరుడు సల్మాన్‌తో కలిసి మరో గ్యాంగ్‌ను కూడా తఖీ అలీ నడిపాడు. రెండు గ్యాంగ్‌లకు లీడర్‌గా ఉన్న తఖీ అలీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర్ర్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. 2012లో బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన తర్వాత జైలు నుంచి విడుదలై తఖీ తన గ్యాంగ్‌ను హైదరాబాద్‌పైకి మళ్లించాడు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో మొత్తం 189 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడింది.

ఈ ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో వరుస స్నాచింగ్‌లకు పాల్పడేవారు. 2015లోనే ఈ గ్యాంగ్ 121 స్నాచింగ్‌లు చేయగా, అంతకు ముందు సంవత్సరాల్లో 67 స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. దాంతో ప్రత్యేకంగా యాంటీ చైన్ స్నాచింగ్ టీంను ఏర్పాటు చేయడంతో పాటు చేజింగ్ అండ్ క్యాచింగ్ టీంలను రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో ఏసీఎస్ ఇరానీ గ్యాంగ్ లీడర్లను పట్టుకునేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. దీంట్లో మొదటగా సైబరాబాద్ పోలీసులు ఇరానీ క్రిమినల్ గ్యాంగ్స్ పూర్తి వివరాలను సంపాదించారు.

రెండు నెలలపాటు స్నాచర్ల వెంట పడిన పోలీసుల ఓ దశలో గుర్రాల బగ్గీలను నడిపించే కూలీల అవతారాన్ని కూడా వేయడంతో స్నాచర్ తఖీ అలీ బిత్తరపోయాడు.తఖీ అలీ అనుచరులైన రాథే, హూస్సేన్, నాజర్, సికిందర్, గులాం, మెండీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గొలుసులు తెంపుకుని పోతున్న ఈ ఇరానీ గ్యాంగ్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీరు విమానాల్లో తిరుగుతారు. కుటుంబం మొత్తం టిఫిన్స్ నుంచి రాత్రి డిన్నర్, స్నాక్స్ వరకు ప్రతీది హోటళ్ల నుంచే తెప్పించుకుంటున్నారు. ప్రతి రోజు వ్యాయామంతోపాటు శక్తినిచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.

అయితే, స్నాచింగ్‌కు వచ్చే ముందు తఖీ అలీ మొదట హైదరాబాద్ ప్రాంతాల గురించి తెలిసిన అతడి అనుచరులను బైక్‌లపై పంపించి వాటిని రైల్వే, బస్‌స్టేషన్ పార్కింగ్ చేయిస్తాడు. వాటి వివరాలను ఫోన్ల ద్వారా తీసుకుని విమానంలో వచ్చి ఆ బైక్‌లపై వెళ్లి స్నాచింగ్‌లను చేస్తూ హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, వైజాగ్, చెన్నై లేదా బెంగళూరుకు చేరుకుంటాడు. అప్పటికే పోలీసులు తన స్థావరానికి వస్తే మకాం మార్చి ఢిల్లీ లేదా లక్నోకు చేరుకుంటాడు.

సైబరాబాద్ పోలీసులకు ఓ స్నాచింగ్ సంఘటనలో సెల్‌ఫోన్ దొరికింది. దీనిపై ప్రత్యేకంగా ఏర్పాటైన యాంటీ చైన్ స్నాచింగ్ టీం ఆ ఫోన్ సిమ్ కార్డు ఆధారంగా రెండు వేల ఫోన్ కాల్స్‌ను జల్లెడ పట్టారు. అలా ట్రాకింగ్ చేయడంతో చివరకు గ్యాంగ్ లీడర్ తఖీ అలీ సమాచారం పోలీసులకు లభించింది. దీని ఆధారంగా ట్రాక్ చేయడంతో దాదాపు తఖీ అలీ గుట్టుతోపాటు సల్మాన్ గ్యాంగ్ వివరాలు కూడా పోలీసులకు లభించాయి.

English summary
Cyberabad police have caught Irani gang leader Taki Ali and his brother Salman, who are notorious for chain snatchings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X