తెలుగు రాష్ట్రాల మీదుగా అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర: రూట్, ప్యాకేజీ, షెడ్యూల్..!!
భారత్ గౌరవ్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా మరో టూర్ ప్యాకేజీ ఖరారైంది. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 9 రాత్రులు / 10 రోజులుతో ఈ టూర్ కొనసాగనుంది. అయోధ్య, వారణాసి తో పాటుగా పలు పుణ్య క్షేత్రల సందర్శన... గంగా హారతి ఉండనునున్నాయి. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా కొనసాగనుంది. దీనికి సంబంధించి ప్యాకేజీని అధికారులు వెల్లడించారు.
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. 10 రోజుల యాత్రలో పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవుని ఆలయం, డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, గంగా హారతి సందర్శనతో పాటు అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

అదే విధంగా ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. యాత్ర ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ధర రూ.17వేలు, త్రీటైర్ ఏసీ రూ.26,700, టూటైర్ ఏసీ టికెట్ ధర రూ.35వేలని తెలిపారు. ప్యాకేజీలో భాగంగా భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు కల్పిస్తారని, వెల్లడిచారు. ప్యాకేజీలో రోజుకు మూడు పూటల భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయి. ఐఆర్సీటీసీ ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులకు కల్పిస్తోంది. మరింత సమాచారం కోసం www.irctctourism.comను విజిట్ చేయాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications