IRCTC బంపర్​ ఆఫర్, కూర్గ్..మైసూర్ తో సహా - 5 రోజులు..ప్యాకేజీ..!!

సంక్రాంతి సెలవుల వేళ ఐఆర్సీటీసీ బంపరాఫర్ ఇస్తోంది. కర్నాటకలోని పలు ప్రదేశాలు చూసేందుకు అతి తక్కువ ధరకే టూర్ ను ఆపరేట్​ చేస్తోంది. అయిదు రోజుల పాటు కర్ణాటకలో పలు ప్రముఖ సందర్శనీయ స్థలాలను దర్శించేలా ప్లాన్ చేసింది. ప్యాకేజీ వివరాలను ఖరారు చేసిన అధికారులు... పూర్తి షెడ్యూల్ ను వెల్లడించారు.

ఐఆర్సీసీటీ సెలవుల్లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కర్నాటకలోని కూర్గ్‌ ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్​. మత్తెక్కించే కాఫీ తోటలు, అద్భుతమైన జలపాతాలు, చారిత్రక కట్టడాలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక కర్నాటకలో మరో అద్భుతమైన ప్రదేశం మైసూర్​. ఇక్కడి రాజభవనం, చందనంతో చేసిన కళాఖండాలు మదిని దోచేస్తాయి. అందుకే ఈ రెండు ప్రాంతాలను వీక్షించేందుకు ఐఆర్​సీటీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. రైలు ప్రయాణం ద్వారా "కాఫీ విత్‌ కర్నాటక" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్​లో భాగంగా మైసూర్​, కూర్గ్​లోని పలు ప్రాంతాలు విజిట్​ చేయవచ్చు. ఫస్ట్​ రోజు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి రాత్రి 7 గంటలకు ట్రైన్​ (కాచిగూడ-మైసూర్​ ఎక్స్​ప్రెస్​ - 12785) బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూరు చేరుకుంటారు. మైసూర్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూర్గ్‌ వెళ్తారు.

irctc-announces-five-days-package-for-karnataka-to-begin-from-kachiguda

ఇక, మధ్యాహ్నం అక్కడి హోటల్‌లో చెకిన్​ తర్వాత ఫ్రెషప్​ అయ్యి అబ్బె వాటర్​ ఫాల్స్​ విజిట్​ చేసి ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుని తిరిగి హోటల్ ​కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్‌లోనే బస ఉంటుంది. మూడో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం భాగమండల, తలకావేరి విజిట్​ చేస్తారు. మధ్యాహ్నం రాజా సీట్‌ పార్క్‌ను సందర్శిస్తారు. ఆరోజు రాత్రి కూడా కూర్గ్‌లోనే స్టే చేస్తారు. నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మైసూర్‌కు స్టార్ట్​ అవుతారు. జర్నీ మధ్యలో కావేరి నిసర్గధామ, టిబెటెన్‌ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్‌ విజిట్​ చేస్తారు. రాత్రికి మైసూరు చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి స్టే చేస్తారు. ఇక, అయిదో రోజు టిఫెన్​ తిన్న హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి చాముండి హిల్స్‌, మైసూర్‌ ప్యాలెస్‌ విజిట్​ చేసి మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్‌కు చేరుతారు. మధ్యహ్నం 3 గంటలకు రైలు మైసూర్‌ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. కంఫర్ట్(3AC) సింగిల్ రూ.34,900, డబుల్ .19,980, ట్రిపుల్ రూ.15,380 గా ఖరారు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+