సికింద్రాబాద్- తిరువనంతపురం జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ- ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే
Secunderabad-Arunachalam express: భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. తిరువణ్ణామలై (అరుణాచలం)- రామేశ్వరం- కన్యాకుమారి పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
ఈ ప్యాకేజీలో తిరువణ్ణామలై- రామేశ్వరం- మధురై- కన్యాకుమారి, తిరువనంతపురం- తిరుచ్చి- తంజావూరు ఉన్నాయి. తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. రామేశ్వరం- రామేశ్వర స్వామి ఆలయం, మధురై- మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి- కుమారి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమొరియల్‌ను సందర్శించవచ్చు.
తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి ఆలయం, తిరుచ్చిలో శ్రీరంగనాథ స్వామి దేవస్థానం, తంజావూరులో బృహదీశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు. తంజావూరుతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,250 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,240 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీలో పెద్దలకు 21,880, పిల్లలకు 20,700 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీలో పెద్దలకు 28,440, పిల్లలకు 27,020 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications