Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్- వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ కవర్..

Secunderabad- Mathura, Vrindavan tourist special train: సికింద్రాబాద్ నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మథుర- బృందావనం - మాతా వైష్ణోదేవి - హరిద్వార్ - రిషికేశ్ వంటి ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం 9 రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.

ఈ వేసవిలో అంటే మే 12వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 160, 3ఏసీ- 490, 2ఏసీ- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ కు భువనగిరి, జనగామ, ఖాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, వార్ధా, నాగ్ పూర్ స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

IRCTC to run Mata Vaishnodevi Yatra Special by Bharat Gaurav Train From Secunderabad Railway Station

ఉత్తర ప్రదేశ్ లోని మధురకు చేరుకోవడంతో ఈ యాత్ర ఆరంభమౌతుంది. తొలి ఆలయం ఇదే. అక్కడ కృష్ణ జన్మభూమిని దర్శించుకోవచ్చు. దీని తర్వాత బృందావనాన్ని సందర్శిస్తారు. అక్కడి బాంకే బిహారీ ఆలయం, ప్రేమ్ మందిరాన్ని తిలకించవచ్చు. ప్రత్యేక పూజలు చేయవచ్చు. బాంకే బిహారీ ఆలయం నుంచి మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది ప్రేమ్ మందిరం. జగద్గురు కృపాలు మహారాజ్ దీన్ని స్థాపించారు.

అక్కడి నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్ నేరుగా మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంది. కాట్రా స్టేషన్ కు చేరుకుంటుంది. దర్శనానికి ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వైష్ణోదేవి ఆలయానికి చేరుకోవడానికి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. గుర్రం, లేదా డోలీ సహాయం తీసుకోవచ్చు. ఈ ప్రయాణ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది. కాట్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి రానుపోను దూరం 26 కిలోమీటర్లు.

దర్శన టిక్కెట్లు, హెలికాప్టర్, బ్యాటరీ కార్ వంటి సౌకర్యాలను యాత్రికులు https://online.maavaishnodevi.org/ వెబ్‌సైట్ ద్వారా స్వయంగా బుక్ చేసుకోవాలి. వైష్ణోదేవి అమ్మవారి దర్శనానంతరం రైలు హరిద్వార్ కు చేరుకుంటుంది. మనసా దేవి ఆలయాన్ని యాత్రీకులు సందర్శించవచ్చు. అక్కడే హర్ కీ పౌరీలో గంగా హారతిలో పాల్గొనవచ్చు. దీని తర్వాత రిషికేష్ ను సందర్శిస్తారు. రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలాల సందర్శనతో ఈ యాత్ర ముగుస్తుంది. రిషికేష్ నుండి ఈ రైలు సికింద్రాబాద్ కు తిరుగుముఖం పడుతుంది.

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 16,500 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 15,400 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 25,700, పిల్లలకు 24,300 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 33,400, పిల్లలకు 31,800 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లు, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+