డివైడర్‌ను ఢీకొట్టిన బాలకృష్ణ కారు: నడిపింది మోక్షజ్ఞే?

హైదరాబాద్: ప్రముఖ సినీటుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన ఫార్చూనర్ కారు మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, ప్రమాద సమయంలో కారులో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఉన్నట్లు .. ఈ మేరకు స్థానికులు చెబుతున్నట్లు 'నమస్తే తెలంగాణ' ఓ కథనం ప్రచురితం చేసింది.

నమస్తే తెలంగాణ ప్రచురితం చేసిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నడిపిన కారే మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం కనీసం ఇంజిన్ కూడా ఆపకుండా వెళ్లడంతో కారు నడిపింది మోక్షజ్ఞ అనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.

Is Mokshagna drives Balakrishna's accidents car?

బాలకృష్ణ తనయుడే కారు నడిపారని స్థానికులు కూడా చెప్తున్నారు. బాలకృష్ణకు చెందిన టయోటా కారు (ఏపీ 02 ఏవై 0001) మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ దవాఖాన చౌరస్తా నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్నది.

క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత రోడ్డు కొంచెం మలుపు ఉండడంతో అదుపుతప్పి కుడివైపున ఉన్న డివైడర్‌పైకి ఎక్కి స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. అయితే కారులో ఉన్నది బాలకృష్ణ కుమారుడు అని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరుగగానే కారును వదిలేసి వెళ్లిపోయారని సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కారును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Is Mokshagna drives Balakrishna's accidents car?

కారును తాను నడుపుతున్నప్పుడే ప్రమాదం జరిగిందంటూ బాలకృష్ణ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకన్న అనే వ్యక్తి బుధవారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తెలిపారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రైవర్ కారు నడిపితే ప్రమాదం జరుగగానే కారు ఇంజిన్ కూడా ఆఫ్ చేయకుండా అక్కడినుంచి వెళ్లిపోడని, కారులో ఉన్నది బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అని తెలుస్తున్నదని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత స్పష్టమైన సమాచారం అందుతుందని పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+