వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ సవాల్ తిరస్కరణకు ఎప్నుడూ అదే కారణమా?గులాబీ నేతల వైఖరి పట్ల జాలిపడుతున్న ప్రజలు!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విధానాలను సూటిగా, నిక్కచ్చిగా ఆధారాలతో సహా విమర్శిస్తుంటారు తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి. తాజాగా మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరించి, బహిరంగ చర్చకు సిద్దమని రేవంత్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమం కోసం గతంలో రూపొందించిన పధకాలపై బహిరంగ చర్చకు సిద్దమేనని పీసిసి ఛీప్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఐతే గతంలో రెండు మూడు సార్లు ఏ కారణం చెప్పి తప్పించుకున్నారో ఇప్పుడు కూడా అదే కారణం చెప్పి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తప్పించుకున్నారని తెలుస్తోంది. కేటీఆర్ ప్రకటన పట్ల తెలంగాణ ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తులుస్తోంది.

సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్.. సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి..

సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్.. సవాల్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి..

రెండు రోజుల క్రితం మంత్రి కేటీ రామారావు కాంగ్రెస్, బీజేపీలకు విసిరిన సవాల్ చినికి చినికి తుపానుగా మారింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆయనకు ముచ్చెమటలు పోయించింది. ఏడున్నరేళ్ల చంద్రశేఖర్ రావు పాలనలో రైతులకు జరిగిన మేలు, దేశంలో ప్రస్తుతం బీజేపీ పాలనలో - అంతకు ముందు కాంగ్రెస్ పాలనలో రైతులకు జరిగిన సంక్షేమంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని కేటీఆర్ ఆ రెండు పార్టీల రాష్ట్ర శాఖలకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కేటీఆర్ సవాల్ కు బీజేపీ ఎక్కడా స్పందించలేదు కానీ కాంగ్రెస్ సింహగర్జన చేసింది.

యూట్యూబ్ ఛానల్ వేదికగా చర్చ.. చెప్పిన కారణమే చెప్పి తప్పించుకున్న కేటీఆర్

యూట్యూబ్ ఛానల్ వేదికగా చర్చ.. చెప్పిన కారణమే చెప్పి తప్పించుకున్న కేటీఆర్

మంత్రి కేటీఆర్ సవాల్ ను అందిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసిన చర్చావేదికకు చేరుకున్నారు.
కేటీఆర్ చర్చకు రావాలంటూ వర్తమానం కూడా పంపించారు. మరి మంత్రి కేటీఆర్ చర్చకు వచ్చారా అన్నదే ఉత్కంఠగా మారింది. ఇలాంటి సందర్బాలను పీక్స్ కు తీసుకెళ్లడం, అక్కడ ఓ ప్రకటన చేసి బహిరంగ చర్చకు రాకుండా తప్పించుకోవడం గులాబీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఇదే అంశం పట్ల గులాబీ నేతలను తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు.

కేటీఆర్ సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు.. ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి

కేటీఆర్ సమాధానానికి చిర్రెత్తుకొచ్చిన నెటిజన్లు.. ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరి బిక్కిరి

రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు వేదికను సిద్దం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ కు చేరుకోవాల్సిని మంత్రి కేటీఆర్ సరిగ్గా అదే సమయానికి, సరిగ్గా ఐదు గంటల సమయంలో ఆస్క్ కేటీఆర్ పేరుతో ఆయన ట్విట్టర్లో ఓ చర్చాగోష్ఠిని ప్రారంభించారు. క్వశ్చన్స్ అడగండి అని నెటిజన్స్ ను ఇన్వైట్ చేశాడు మంత్రి కేటీఆర్. అక్కడ రేవంత్ రెడ్డి విసిరిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇక్కడకు వచ్చి ప్రశ్నలడగండని ప్రజలను ఆహ్వానిస్తాడేంటని అవాక్కయ్యారు తెలంగాణ ప్రజలు. అవాక్కయిన వారు ఆగ్రహానికి లోనై కేటీఆర్ ను చిరాకెత్తించారు. ప్రశ్నలతో మంత్రి కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసారు.

బహిరంగ చర్యకు సిద్దమా అని ప్రశ్నించిన కేటీఆర్.. తీరా చర్చకు మొహం చాటేసిన మంత్రి

బహిరంగ చర్యకు సిద్దమా అని ప్రశ్నించిన కేటీఆర్.. తీరా చర్చకు మొహం చాటేసిన మంత్రి

అక్కడ రేవంత్ రెడ్డి మీ కోసం చర్చకు సిద్దంగా ఉన్నారు, వెళ్లి చర్చలో పాల్గొంటారా లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఇరకాటంలో పడ్డ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన సమాదానమే మళ్లీ చెప్పుకొచ్చారు. గతంలో చూపిన సాకునే మళ్లీ చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసారు. కానీ పరిణతి చెందిన నెటిజన్లు మాత్రం కేటీఆర్ ను ప్రశ్నలతో ఆడుకున్నారు. సమస్య ఉత్పన్నం కావడానికి కారణమైన మీరు అదే అంశానికి సమాధానం చెప్తామంటే ఎందుకు వెనక్కు వెళ్తున్నారని నిలదీసారు.

ఓటుకు నోటు కేసును కారణంగా చూపే ప్రయత్నం.. తిప్పి కొట్టిన నెటిజన్లు..

ఓటుకు నోటు కేసును కారణంగా చూపే ప్రయత్నం.. తిప్పి కొట్టిన నెటిజన్లు..

అంతే కాకుండా కేటీఆర్ కు ఆన్ లైన్ ఫాలోవర్లు ఎక్కువ. ఆయనను ఉన్నత విద్యావంతులు చాలా మంది ఇష్టపడతారన్న చర్చ కూడా ఉంది. అంతే కాకుండ
ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్ కు మంచి ఇమేజ్ ఉందన్న ఫీల్ ఉంది. అట్లాండి కేటీఆర్, గురువారం అకస్మాత్తుగా, అవగాహన లేని వ్యక్తి లాగా ట్వీట్టర్ వేదిక నుంచి పెట్టిన కామెంట్ పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "రేవంత్ రెడ్డి ఓ 420, క్రిమినల్" ఇది ఆయన కామెంట్. ఓటుకు నోటు కేసు గురించి ఆయన చెప్పదలచుకున్నారు. ఓటుకు నోటు కేసు రహస్యం ఏమీ కాదు. అది జరిగి ఆరేళ్లవుతోంది. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. విచారణలో దోషిగా తేలే వరకు భారత శిక్షాస్మృతి చట్టాల ప్రకారం ఎవరూ క్రిమినల్స్ గా పరిగణించబడరు. పైగా అలా అనడం నేరం కూడా. అది పరువు నష్టం కిందకు వస్తుంది.

కేటీఆర్ అవగాహనా రాహిత్యం.. దోషిగా ఎలా నిర్ధిరిస్తారన్న ప్రజలు..

కేటీఆర్ అవగాహనా రాహిత్యం.. దోషిగా ఎలా నిర్ధిరిస్తారన్న ప్రజలు..

ఈ విషయం అమెరికాలో అత్యున్నత చదువులు చదవి, మంత్రిగా ఉన్న కేటీఆర్ కు తెలియదా అన్నది ప్రశ్న. అవగాహన లేని వాడు కామెంట్ చేసినట్టుగా కోర్టులో విచారణలో ఉన్న కేసు విషయంలో కేటీఆర్ ఇట్లా బాధ్యతారాహిత్యంతో కామెంట్ చేయడాన్ని ఆయనను అభిమానించే విద్యావంతులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి దోషా కాదా అన్నది కోర్టు తేల్చక ముందే ఆ ట్యాగ్ తగిలించడానికి కేటీఆర్ ఎవరు అన్నది ముఖ్యమైన ప్రశ్న. చట్టాలు చేసేవారు, చట్టాల గురించి తెలిసినోళ్లు ఇలా కామెంట్ చేస్తే సామాన్యుల పరిస్థితేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

English summary
Revanth recently accepted the challenge thrown by Minister KTR and announced that he was ready for a public discussion. PCC chief Rewanth Reddy said the Congress party was ready for a public debate on schemes designed in the past for the welfare of farmers. However, it seems that Minister Kalwakuntla Taraka Rama Rao escaped for the same reason two or three times in the past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X