హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ చెప్పిందే జరుగుతోందా: ఆ నాలుగు రాష్ట్రాల్లో కలకలం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన అంచనాలు నిజం అయ్యాయా?, ఆయన చెప్పిందే అక్కడ జరుగుతోందా?, ఇలాంటి కల్లోల పరిస్థితులు ఏర్పడొచ్చంటూ చేసిన హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చాయా?.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా దీనిపై ఇప్పుడిప్పుడే చర్చ ఆరంభమైంది. అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కేసీఆర్ చెప్పిన జోస్యం నిజమైందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

అసాధారణ వర్షాలు..

అదే- క్లౌడ్ బరస్ట్. క్లౌడ్ బరస్ట్ వెనుక కుట్ర ఉందంటూ కేసీఆర్ మొన్నీ మధ్యే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భద్రాచలంలో గోదావరి వరద బాధితులను పరామర్శకు వెళ్లిన సమయంలో ఆయన క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని లేవనెత్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనూహ్యంగా భారీ వర్షాలు కురవడం వెనుక కుట్ర కోణం ఉండొచ్చంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నార్త్‌లో మళ్లీ..

ఈ మధ్య దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతోందని గుర్తు చేశారు. ఇది జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో క్లౌడ్‌ బరస్ట్‌తో కృత్రిమ వరదలను సృష్టించారని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని కేసీఆర్ అప్పట్లో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తిస్థాయిలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు అప్పట్లో విమర్శలు గుప్పించారు.

అంచనాలు నిజం అయ్యాయా?

ఇప్పుడవే అనుమానాలు, అంచనాలు నిజం అయ్యాయా? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. దీనికి కారణం లేకపోలేదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లల్లో సంభవిస్తోన్న భారీ వరదలు సంభవిస్తోన్నాయి. అంచనాలకు మించిన వర్షాలు కురుస్తోన్నాయి. కొండచరియలు విరిగిపడుతోన్నాయి. రోడ్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. నదులు ఉప్పొంగడం వల్ల తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్య ప్రజలు మరణించారు.

58 మందికి పైగా..

క్లౌడ్ బరస్ట్ వల్ల హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లల్లో సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 58 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. లక్షలాది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాల వల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న నదులన్నీ ఉప్పొంగాయి. తీర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వరదల తీవ్రత వల్ల సంభవించిన నష్టం భారీగా ఉంటోంది. పోటెత్తిన నదుల ధాటికి వంతెనలు సైతం తట్టుకోవట్లేదు. పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి.

ఇంత అసాధారణమా?

ఇంత అసాధారణమా?

సాధారణంగా క్లౌడ్ బరస్ట్ అనేది తరచూ ఏర్పడేది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో సీజన్‌లో ఒక్కసారి క్లౌడ్ బరస్ట్ సంభవించినా అది గొప్పే అనే అభిప్రాయం వారిలో వ్యక్తమౌతోంది. అలాంటి ప్రతి వర్షాకాలంలో.. రోజుల వ్యవధిలో అవి ఏర్పడుతోండటం.. విలయాన్ని సృష్టిస్తోండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కేసీఆర్ వ్యక్తం చేసిన క్లౌడ్ బరస్ట్ కుట్ర అనుమానాలు నిజమౌతున్నాయా? అనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది.

English summary
Is Telangana CM KCR predicts over Cloud burst became true?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X