కేసీఆర్ సబితమ్మల మధ్య డీల్ ఇదేనా ? అందుకే కాంగ్రెస్ కు సబితమ్మ షాక్ ఇవ్వనున్నారా ?
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత, మాజీ మంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా మెలిగిన చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ ల మీద యూ టర్న్ లు తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న చేవెళ్ళ చెల్లెమ్మ కాంగ్రెస్ అధిష్టానం నుండి ఫోన్ రావడంతో, స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయడంతో కాస్త వెనక్కి తగ్గారు. అయితే సబితా ఇంద్రారెడ్డిని ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీలో చేర్పించాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్ మజ్లీస్ అధినేత అసద్ ను మరోమారు రంగంలోకి దింపారు.

కెసిఆర్ కు సబితా ఇంద్రారెడ్డికి మధ్య డీల్ ఏంటి?
మొదట సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్ లో చేర్చటానికి అసదుద్దీన్ ఓవైసీనే రాయబారం నెరపారు. దీంతో రెండో దఫా కూడా కేసీఆర్ ఆయన్నే రంగంలోకి దింపారు. ఇంతకీ సబితా ఇంద్రారెడ్డికి, అసదుద్దీన్ ఓవైసీకి మధ్య జరిగిన సంభాషణ ఏంటి? స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేసినా సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అసలు పార్టీ మారటానికి కెసిఆర్ కు సబితా ఇంద్రారెడ్డికి మధ్య కుదిరిన డీల్ ఏంటి అనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సబితమ్మ కు మంత్రి... కుమారుడికి ఎమ్మెల్సీ
సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డికి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారని భావించి సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. అయితే సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి ఎంపీ గా అవకాశం ఇవ్వడానికి కెసిఆర్ అంగీకరించలేదు. దాంతోనే కొంత ఆమె వెనక్కు తగ్గారు. అయితే అదే సమయంలో సబితా ఇంద్రారెడ్డి చిన్న పుచ్చుకోకుండా కెసిఆర్ ఆమెకు మరో ఆఫర్ ఇచ్చినట్లు గా తెలుస్తుంది. కార్తీక్ రెడ్డి కి ఎంపీ టికెట్ కు నో చెప్పిన కేసీఆర్, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

కారెక్కేందుకే సబితమ్మ యూటర్న్.... ఢిల్లీ టూరు క్యాన్సిల్..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లో ఉండి మనుగడ సాగించటం కంటే, అధికార పార్టీలో మంత్రిగా అవకాశం వస్తుంది కాబట్టి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. అంతేకాకుండా తన కుమారుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి కెసిఆర్ అంగీకరించడంతో ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అవ్వాలనుకున్న సబితా ఇంద్రారెడ్డి అందుకు భిన్నంగా తన ఢిల్లీ టూర్ ను క్యాన్సిల్ చేసుకుని కారు ఎక్కడానికి సిద్ధమై పోయినట్లుగా సమాచారం. మొత్తానికి చాలా కాలం నానవేత ధోరణి తరువాత, బోలెడు తర్జనభర్జనల నడుమ సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరనున్నట్లు గా తెలుస్తుంది.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications