వైఎస్సార్ స్వాంతంత్ర్య సమరయోధుడా? రిపబ్లిక్ డే సాక్షిగా వైఎస్ షర్మిలకు తప్పని ట్రోల్స్!!
గణతంత్ర దినోత్సవం సాక్షిగా వైఎస్ షర్మిల కూడా ట్రోల్స్‌ను ఎదుర్కొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టటంపై నెటిజన్లు వైఎస్ షర్మిలను ట్రోల్ చేస్తున్నారు.
74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఇక అన్ని రాజకీయ పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను తమదైన శైలిలో జరుపుకున్నారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొన్ని పార్టీలు చేసిన కార్యక్రమాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను చెప్పులతో ఎగరవేయడం సోషల్ మీడియాలో ట్రోల్స్ కు కారణం కాగా, ఇక వైయస్ షర్మిల ను కూడా టార్గెట్ చేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇంతకు వైఎస్ షర్మిల ఏం చేశారంటే..

మహాత్మా గాంధీ ఫోటో పక్కన, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీలో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని భారత రాజ్యాంగాన్ని ఆమె కొనియాడారు.
అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో పక్కన, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టి పూలమాలలు వేసి వైయస్ షర్మిల నమస్కరించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ఆర్ దేశ స్వాతంత్రం కోసం పోరాడారా? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ..
మహాత్మా గాంధీ పక్కన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గాంధీ పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎలా పెడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ దేశ స్వాతంత్రం కోసం పోరాడారా? రిపబ్లిక్ ఇండియా కోసం పని చేశారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.రాజ్యాంగం రాయడానికి ఆనాడు రాజా రెడ్డి, ఆయన కొడుకు రాజశేఖరరెడ్డి,అయన కొడుకు జగన్ రెడ్డి చాలా పోరాటం చేశారు అందుకే అలా ఫోటో పెట్టారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

రిపబ్లిక్ డే వేడుకల సాక్షిగా షర్మిల పై ట్రోల్స్
తెలంగాణలో షర్మిల రాజకీయాలు చేస్తే ఇలాంటివి చూడాల్సి వస్తుందని ముందు ముందు మరేం చూడాల్సి వస్తుందో అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రిపబ్లిక్ డే వేడుకల విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం రాజకీయ పార్టీ నాయకులకు తలనొప్పిగా మారింది.
వైఎస్ షర్మిల పైన కూడా ట్రోల్స్ కు కారణంగా మారింది. రాజకీయ పార్టీల నాయకులు చేసే వాటిని నెటిజన్లు మాత్రం ప్రతి ఒక్కదాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రకరకాల ప్రశ్నలు సంధిస్తూ టార్గెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications