హైదరాబాద్ లో ఐసిస్ : ఆ కాలేజీపై అనుమానాలు!? లెక్చరర్ ఆత్మహత్య!
హైదరాబాద్ : ప్రపంచదేశాలను ఉగ్రవాదంతో గడగడలాడిస్తోన్న ఐసిస్ హైదరాబాద్ లోను పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నగరంలోని మలక్ పేట పరిధిలో ఉన్న ఎంఎస్ మైనారిటీ కళాశాల లెక్చరర్ ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో.. విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిసినట్టు సమాచారం.
కాగా, మలక్ పేటలోని ఎంఎస్ మైనారిటీ కళాశాలలో కొన్నాళ్లుగా లెక్చరర్ గా పనిచేస్తోన్న ప్రవీణ్ కుమార్ ఈమధ్యే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు అతను రాసిన ఓ లేఖ పోలీసులకు దొరికింది. మలక్ పేటలోని ఎంఎస్ మైనారిటీ కళాశాలలో ఐసిస్ ఉగ్రవాదులు పలువురు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని లేఖలో ప్రవీణ్ కుమార్ పేర్కొన్న విషయాన్ని పోలీసులు గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

చనిపోయే ముందు సేవ్ కంట్రీ అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి చనిపోయాడు ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం దీనిపై మరింత లోతుగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications