KTR Sircilla Tour: విజ్ఞానానికి మించిన సంపద లేదు.. సిరిసిల్లలో విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన కేటీఆర్..

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గంలో పర్యటించారు. సిరిసిల్లలో గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ట్యాబ్‌లను అందజేశారు. విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తామని పేర్కొన్నారు. 'మన ఊరు-మన బడి' కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు.

అంబులెన్సులు
గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది ఇంటర్‌ విద్యార్థులకు ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేస్తున్నాని చెప్పారు.

 IT and Municipal Minister KTR Sirisilla distributed the tabs to the students

చీరల పంపిణీ
కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ అందజేసిన అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను కేటీఆర్ పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలతో సిరిసిల్ల చేనేతలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+