దొంగే దొంగ అన్నట్టుంది .. ఐటీ గ్రిడ్ పై తెలంగాణ మంత్రి తలసాని
హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ తలో మాట చెబుతోందని విమర్శించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొన్ని సార్లు డేటా చోరి అయిందని .. మరోసారి కాలేదని టీడీపీ నేతలు చెప్పడాన్ని తప్పుబట్టారు. టీడీపీ నేతల వైఖరి పూటకోమాదిరిగా మారుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు దొంగే దొంగ అన్నట్టుందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ మంత్రులు పోలీసు స్టేషన్ కు వెళ్లి తెలంగాణ మంత్రులపై ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు.

వాస్తవాలను ప్రపంచానికి తెలుపండి
ఐటీ గ్రిడ్ డాటా వ్యవహారంపై వాస్తవాలు ప్రజలకు తెలుపాలని మీడియాను కోరారు. కొందరు దీనిని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కూడా 24 లక్షల ఓట్లను తొలించి గెలిచిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఐటీ గ్రిడ్ అంశంపై జర్నలిస్టు సంఘాలు ఒక కమిటీ వేసి నిష్పాక్షికంగా విచారణ చేయాలని సూచించారు.
అధికారులను బలిచేశారు
ఐటీ గ్రిడ్ డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించి కాదని .. అది ఏపీ ప్రజలదని లోకమంతటికి తెలుసున్నారు. తిమ్మిని బమ్మి చేయగల చంద్రబాబు .. కొన్ని మీడియా సంస్థలతో తప్పును ఒప్పుగా చిత్రీకరిస్తున్నారని ఫైరయ్యారు. ఏపీలో ఎమ్మెల్యేలను, మంత్రులను వ్యవస్థలు చంద్రబాబు నాశనం చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసింది చంద్రబాబు అయితే .. ఏపీ అధికారులను బలి చేస్తున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications