• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ మంత్రి వర్గంలో రోజాకు ఛాన్స్ ఇస్తే బాగుండేది అన్న రాములమ్మ .. సీఎం జగన్ కు సూచన

|
  రోజాకు మంత్రి వర్గంలో ఛాన్స్ఇస్తే బాగుండేది : రాములమ్మ || Oneindia Telugu

  తెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కెసిఆర్ జగన్ ను చూసైనా బుద్ధి తెచ్చుకుంటారా అంటూ కెసిఆర్ కు చురకలంటించారు. అంతేకాదు సినీనటి రోజా విషయంలో కూడా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  రోజాకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుండేది అన్న విజయశాంతి

  రోజాకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బాగుండేది అన్న విజయశాంతి

  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రివర్గంలో సినీ నటి రోజాను కూడ తీసుకుని ఉంటే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆమె ట్వీట్ చేశారు. సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని తను అభిప్రాయంగా చెప్పిన విజయశాంతి సినీరంగం నుండి రాజకీయ రంగానికి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటూ పేర్కొన్నారు. సినీ రంగం నుంచి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలను వినియోగించుకునేలా ప్లాన్ చేయాలని ఆమె సూచించారు. సినీరంగం నుండి వచ్చినవారికి తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని ఆమె తన అభిప్రాయం గా చెప్పారు. ఇప్పటికైనా రోజా విషయంలో జగన్ పునరాలోచించాలని ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బావుంటుందని జగన్ కు విజయశాంతి సూచన చేశారు .

  కేసీఆర్ కు మహిళలపట్ల ఉదాసీన వైఖరి ఉంది... అందుకే నేటికీ మంత్రి వర్గంలో మహిళలు లేరన్న రాములమ్మ

  కేసీఆర్ కు మహిళలపట్ల ఉదాసీన వైఖరి ఉంది... అందుకే నేటికీ మంత్రి వర్గంలో మహిళలు లేరన్న రాములమ్మ

  ఇదే సమయంలో కెసిఆర్ పై మండి పడిన విజయశాంతి కేసీఆర్ తన మంత్రివర్గంలో ఐదేళ్ల పాటు మహిళను లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఐదేళ్లు ఇదే ప్లాన్ తో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణా సీఎం కెసిఆర్ కు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలనే విషయంపై పెద్దగా పట్టింపు లేకపోవడం మహిళలపై ఆయనకున్న ఉదాసీనతకు నిదర్శనమని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని రాములమ్మ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తారనే నమ్మకం తమకు లేదని ఆమె పేర్కొన్నారు .

  జగన్ ను చూసైనా కేసీఆర్ మారతారా ? క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నించిన విజయశాంతి

  జగన్ ను చూసైనా కేసీఆర్ మారతారా ? క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నించిన విజయశాంతి

  ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పుపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటున్నానన్న విజయశాంతి జగన్ మంత్రివర్గంపై ఇప్పుడు జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉపముఖ్యమంత్రి పదవి తో పాటు, అత్యంత కీలకమైనహోంశాఖను సైతం కేటాయించి మహిళలకు సముచిత స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. కనీసం జగన్ ను చూసైనా కెసిఆర్ మారతారా? కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నించారు విజయశాంతి.

  ఇక రోజా కు మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరటం వెనుక విజయశాంతి కూడా సినీ రంగం నుండే వచ్చారు కాబట్టి సహజంగానే సినీ రంగం నుండి వచ్చి రాజకీయాల్లో పని చేసే వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పటం ఉద్దేశంగా కనిపిస్తుంది .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress leader and former MP Vijayashanti made several key comments YS Jaganmohan Reddy at the same time, Telangana CM KCR. Vijayasanthi said that it would be nice if AP CM YS Jagan Mohan Reddy would bring actress Roja in his cabinet.Jagan's cabinet now has a huge debate on national level. Jagan has given women the position of Deputy Chief Minister in his Cabinet, given the most important home minister post also . Will the KCR change by see at least Jagan? Vijayasanthi questioned whether women would be given a chance in the KCR cabinet ?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more