చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంపల్లి జయ ఫాంహౌస్‌లో ఐటీ దాడులు, కేంద్రంపై దినకరన్ తీవ్రవ్యాఖ్యలు

తమిళనాడులో ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. 187 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తమిళనాడు, ఢిల్లీతో పాటు తెలంగాణలోను సోదాలు నిర్వహిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడులో ఆదాయపన్ను శాఖ (ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. 187 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తమిళనాడు, ఢిల్లీతో పాటు తెలంగాణలోను సోదాలు నిర్వహిస్తున్నారు.

మోడీ ఎఫెక్ట్: శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఐటీ శాఖ షాక్, బెంగళూరు నుంచి దినకరన్ పరుగో పరుగు! మోడీ ఎఫెక్ట్: శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఐటీ శాఖ షాక్, బెంగళూరు నుంచి దినకరన్ పరుగో పరుగు!

హైదరాబాదులోని కొంపల్లిలోను సోదాలు

హైదరాబాదులోని కొంపల్లిలోను సోదాలు

హైదరాబాద్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ ఫామ్ హౌస్ ఉంది. ఇది కొంపల్లిలో ఉంది. ఇక్కడి జయలలిత గార్డెన్స్‌లోనూ ఐటీ ఆధికారులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

 పన్ను ఎగవేత, డొల్ల కంపెనీలు

పన్ను ఎగవేత, డొల్ల కంపెనీలు

చెన్నై టీనగర్‌లోని శశికళ మేనకోడలు కృష్ణప్రియ నివాసంతో పాటు శశికళకు చెందిన జాన్ సినిమా హాళ్ల కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. పెన్ను ఎగవేత ఆరోపణలతో పాటు డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం రావడంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లోను సోదాలు నిర్వహించారు.

 ఈ దాడులు కొత్త కాదు

ఈ దాడులు కొత్త కాదు

ఐటీ సోదాలపై దినకరన్ ఘాటుగా స్పందించారు. ఈ దాడులు తమకు కొత్త కాదని చెప్పారు. తాము ఎలాంటి దాడులను అయినా ఎదుర్కొంటామని చెప్పారు.

 ఐటీ దాడుల వెనుక కేంద్రం హస్తం

ఐటీ దాడుల వెనుక కేంద్రం హస్తం

శశికళను మరో ఇరవై ఏళ్లు జైలులో పెట్టినా బయటకు వచ్చాక రాజకీయాల్లో పాల్గొంటారని దినకరన్ స్పష్టం చేశారు. ఐటీ దాడుల వెనుక కేంద్రం హస్తం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

English summary
Income Tax department raided the Chennai office of Jaya TV and 186 other locations early on Thursday morning over allegations of tax evasion. Jaya TV is controlled by jailed AIADMK leader V K Sasikala’s family and is considered to be politically disposed in favour of deposed leaders Sasikala and T T V Dinakaran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X