కొత్త ఎమ్మెల్సీలు వీరే..!! కేసీఆర్ లెక్క పక్కా - ఆ నాలుగు వర్గాలకు ఆరు సీట్లు..!!
హుజూరాబాద్ ఫలితం తరువాత తెలంగాణ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక, పార్టీ పరంగా అవకాశాల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీ పైన కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఆరు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. వీటికి గాను నాలుగు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీసీలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం రెండేసి సీట్లను ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆ ఇద్దరికీ పక్కా అయినట్లే
అదే విధంగా మరో రెండు స్థానాలను వెలమ..ఎస్సీ వర్గాలకు ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి (ఎల్.రమణ), అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి (విశ్వబ్రాహ్మణ) పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. శాసనసభలో ప్రాతినిధ్యం లేని బీసీ సామాజికవర్గంలో పద్మ శాలి, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి కులాలకు చెందిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మూడో స్థానం సైతం బీసీలకే ఇవ్వాలని భావిస్తే.. జీ ప్రభుత్వ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, కర్నె ప్రభాకర్, పీఎల్ శ్రీనివాస్, తాడూరు శ్రీని వాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

గుత్తాకు రెన్యువల్ ఖాయమంటూ
రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ పొందిన ఎంసీ కోటి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఒకే జిల్లా నుంచి ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి అవకాశం ఒకే సారి సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. శ్వర్‌రెడ్డి ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇక, గతంలో ఇచ్చిన హామీ మేరకు వెలమ సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని తెలుస్తోంది.

మోత్కుపల్లి లేదా ఎర్రోళ్ల
ప్రస్తుతం మండలిలో ఈ సామాజికవర్గం నుంచి కల్వకుంట్ల కవిత, భానుప్రసాద్, నవీన్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల కోటాలో వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కవిత, భానుప్రసాద్ పదవీకాలం పూర్తవుతుండటంతో రవీందర్‌రావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహుల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలో మరో 12 స్థానాల భర్తీ
వచ్చే సాధారణ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే లేదా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని పంపాలనే వ్యూహంతో అధినేత కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో పదవుల భర్తీలో యువతకు ప్రాధాన్యతనిస్తున్న కేసీఆర్ గతంలో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు సైతం పరిశీలనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ అయిన ఎమ్మెల్యే కోటాలోని ఆరు స్థానాలతో పాటుగా త్వరలో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు తెలంగాణలో భర్తీ చేయాల్సి ఉంది.
Recommended Video

8న పేర్లు అధికారికంగా ప్రకటించే ఛాన్స్
జనవరి మొదటి వారంలో 12 మంది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతోంది. ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల చివరి వారం లేదా డిసెంబర్ తొలివారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. దీంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులనూ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేస్తున్నారు. సోమవారం అధికారికంగా ఆరుగురు జాబితాను పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications